చైతూతో పెళ్లి తర్వాత ఎవరూ నా ముఖం చూడట్లేదు... నా పరిస్థితి దారుణం.. సమంత ఆవేదన
అక్కినేని వారసుడు నాగచైతన్యతో పెళ్లి తర్వాత సమంతను వరుస హిట్లు పలకరించాయి. గతేడాది రంగస్థలం, మహానటి, అభిమన్యుడు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకొన్నారు. అలాగే ఈ ఏడాది ఆరంభంలోనే సూపర్ డీలక్స్‌తో మంచి విజయాన్ని, విమర్శకులు ప్రశంసలను అందుకొన్నది. అయితే పెళ్లి తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తూ తన ప్రతిభకు సానపెడుతున్నది ఈ బ్యూటీ. అయితే వివాహం తర్వాత నాకు ఆఫర్లు తగ్గాయని సమంత ఇటీవల ఇంటర్వూలో చెప్పడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సమంత ఏమన్నారంటే..

పెళ్లి తర్వాత దారుణంగా
నేను పెళ్లి చేసుకొన్న తర్వాత ఆఫర్లు చాలా తగ్గిపోయాయి. నిర్మాతలు నావైపు చూడటం లేదు. పెళ్లికి ముందు వచ్చిన ఆఫర్లు ఇప్పుడు లేవు. పెళ్లి తర్వాత నాకు మానసికమైన ఓ బెంగ పట్టుకొన్నది. రంగస్థలం, మహానటి సినిమాలు పెళ్లికి ముందు ఒప్పుకొన్నాను. అవి పెళ్లి తర్వాత రిలీజ్ అయ్యాయి. వాటి క్రెడిట్‌ను నేను తీసుకోవాలా వద్దా అనే విషయం సందిగ్ధంగా ఉంది. పెళ్లి తర్వాత రిలీజైన వాటిని నేను క్రెడిట్‌గా తీసుకోలేను అని సమంత అన్నారు.

దర్శక, నిర్మాతలు పట్టించుకోవడం లేదు
పెళ్లికి ముందు దర్శక, నిర్మాతలు నన్ను ఎక్కువగా అప్రోచ్ అయ్యేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. దాంతో పెళ్లికి ముందు చేసిన మాదిరిగా నేను ఇప్పుడు చేయడం లేదు. పెళ్లి తర్వాత దర్శక, నిర్మాతల దృక్పథం మారిందని నేను అనుకొంటున్నాను. నన్ను ఏ రకంగా చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనే అంశంపై వారు ఆలోచిస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది అని సమంత పేర్కొన్నారు.

ఆఫర్లు లేకపోయినా దక్షిణాదిలోనే
ఇక ఆఫర్లు ఉన్నా, లేకపోయినా తాను దక్షిణాది సినిమాలకే పరిమితం అవుతాను. బాలీవుడ్ రంగానికి వెళ్లే ఆలోచన లేదు. హిందీ పరిశ్రమ వర్కింగ్ స్టయిల్ అర్థం కావడం చాలా కష్టం. అందుకే నా ప్రాంతపు ప్రేక్షకులనే ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తాను. దక్షిణాది భాష తప్ప మరో భాషలో నటించను అని సమంత స్పష్టం చేసింది.

హే బేబీగా సమంత అక్కినేని
2019 సంవత్సరాన్ని సమంత ఘనంగా ప్రారంభించింది. తమిళంలో సూపర్ డీలక్స్, తెలుగులో శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలి చిత్రాలతో సక్సెస్ అందుకొన్నారు. ప్రస్తుతం నందినిరెడ్డి దర్శకత్వంలో ఓ బేబీ అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రం జూలై 5వ తేదీన రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. అలాగే నాగార్జునతో మన్మథుడు2 చిత్రంలో కూడా కనిపించబోతున్నది.


Click it and Unblock the Notifications











