సమంత క్రేజ్ మామూలుగా లేదే.. 2021కి నెం1 సమంతే.. టాప్ 10లో ఎవరెవరు ఉన్నారు అంటే?

ప్రముఖ సర్వే సంస్థ ఆర్మాక్స్ మీడియా గత ఏడాది మొత్తానికి గాను టాప్ 10 తెలుగు హీరోలు, హీరోయిన్స్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ సర్వేలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన తెలుగు హీరోగా మహేష్ బాబు మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అలాగే అల్లు అర్జున్ రెండో స్థానాన్నీ నిలబెట్టుకున్నారు. ఇక తెలుగు హీరోలను ప్రకటించినట్టుగానే హీరోయిన్ జాబితాను కూడా రిలీజ్ చేయగా అందులో హీరోయిన్ల స్థానాలు ఎలా ఉన్నాయి అనేది పరిశీలిద్దాం.

1 - సమంత అక్కినేని 2 - కాజల్ అగర్వాల్

1 - సమంత అక్కినేని 2 - కాజల్ అగర్వాల్

టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ ఫిమేల్ కేటగిరీలో సమంత ప్రతి నెల లాగే ఏడాది మొత్తానికి కలిపి కూడా సమంతానే నిలబెట్టుకుంది. చివరిగా పుష్ప అనే సినిమాలో ఐటెం సాంగ్ కు డ్యాన్స్ వేసిన ఆమె, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ పార్ట్ 2 రిలీజ్ అయి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఒక తమిళ సినిమాతో అలాగే శాకుంతలం సినిమాల్లో నటిస్తోంది. ఇవి కాక మరిన్ని సినిమాలను కూడా ప్రకటించారు. విడాకుల ప్రకటన తర్వాత ఆమె గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఇక కాజల్ అగర్వాల్ ఏడాది మొత్తానికి రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా మోసగాళ్లు అనే తెలుగు సినిమాలో కనిపించిన ఈ భామ ప్రస్తుతం నాలుగు తమిళ సినిమాలు చేస్తూ ఉండగా, తెలుగులో ఆచార్య అనే ఒక్క సినిమాలో మాత్రమే నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక తాను గర్భవతిగా ఉన్నట్టు ఆమె ప్రకటించింది.

3- అనుష్కశెట్టి 4- పూజా హెగ్డే

3- అనుష్కశెట్టి 4- పూజా హెగ్డే

సినిమాలలో కనిపించకున్నా అనుష్క ఏడాది మొత్తానికి ఈ జాబితాలో మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా నిశ్శబ్దం అనే సినిమాలో కనిపించిన అనుష్క మొన్న పుట్టిన రోజు సందర్భంగా యూవీ ప్రొడక్షన్స్ లో సినిమాని అనౌన్స్ చేసింది. అయితే అనుష్క ఏడాది మొత్తానికి గాను ఏర్పాటు చేసిన ఈ లిస్టులో మూడో స్థానంలో నిలవడం గమనార్హం. ఇక ఇక బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఈ జాబితాలో నాలుగో స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ భామ ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది కానీ కుదరలేదు.

5- తమన్నా 6- రష్మిక మందన్న

5- తమన్నా 6- రష్మిక మందన్న

మిల్కీ బ్యూటీ తమన్నా ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. చివరిగా సీటీమార్, మాస్ట్రో సినిమాలలో నటించిన ఆమె ప్రస్తుతం తెలుగులో ఎఫ్ త్రీ, గుర్తుందా శీతాకాలం సినిమాల్లో కూడా నటిస్తోంది. గుర్తుందా శీతాకాలం సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. గీత గోవిందం భామ రష్మిక మందన్న ఈ జాబితాలో ఆరవ స్థానంలో నిలిచింది. ఆమె చివరిగా అల్లు అర్జున్ సరసన పుష్ప అనే సినిమాలో కనిపించి హింట్ అందుకుంది. ఇక ఆమె బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటిస్తోంది.

7- కీర్తి సురేష్ 8-రకుల్ ప్రీత్ సింగ్

7- కీర్తి సురేష్ 8-రకుల్ ప్రీత్ సింగ్

కీర్తి సురేష్ ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. గత ఏడాది చివరిగా అన్నాత్తే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ ప్రస్తుతం తెలుగులో సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ జాబితాలో రకుల్ ప్రీత్ సింగ్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. చివరిగా కొండపొలం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ఇటీవలే తన ప్రియుడిని పరిచయం చేసి, వార్తల్లో నిలిచింది. ఇక బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోందిట.

9- సాయి పల్లవి 10- రాశి ఖన్నా

9- సాయి పల్లవి 10- రాశి ఖన్నా

సాయి పల్లవి ఏడాది మొత్తానికి గాను తొమ్మిదో స్థానంలో నిలిచింది. చివరిగా లవ్ స్టోరీ అనే సినిమాతో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి పల్లవి ఇప్పుడు విరాటపర్వం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఇక ఈ జాబితాలో రాశి ఖన్నా పదో స్థానం దక్కించుకుంది. ఆమె ప్రస్తుతం పక్కా కమర్షియల్, థాంక్యూ, అనే తెలుగు సినిమాలలు చేస్తోంది. అలాగే కొన్ని తమిళ సినిమాలు కూడా చేస్తోంది.


More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X