ఎక్కడా తగ్గని సమంత క్రేజ్.. ఇప్పటికీ టాలీవుడ్ నెం.1 పొజిషన్ లోనే.. టాప్ 10లో యంగ్ హీరోయిన్ కి చోటు!
ప్రముఖ సర్వే సంస్థ ఆర్మాక్స్ మీడియా ఎప్పటి లాగానే ఫిబ్రవరి 2022కి గాను టాప్ 10 తెలుగు హీరోలు, హీరోయిన్స్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ సర్వేలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన తెలుగు హీరోగా అల్లు అర్జున్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అయితే ఈసారి ప్రభాస్ సెకండ్ ప్లేస్ కి వచ్చి చేరారు. తెలుగు హీరోలను ప్రకటించినట్టుగానే హీరోయిన్ జాబితాను కూడా రిలీజ్ చేయగా అందులో హీరోయిన్ల స్థానాలు ఎలా ఉన్నాయి అనేది పరిశీలిద్దాం.

1 - సమంత అక్కినేని 2 - కాజల్ అగర్వాల్
టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ ఫిమేల్ కేటగిరీలో సమంత తనకు ఎవరూ పోటీలేరని నిరూపించుకుంటోంది. ప్రతి నెల లాగే ఫిబ్రవరి నెలలో కూడా మొదటి స్థానాన్ని సమంతా నిలబెట్టుకుంది. చివరిగా పుష్ప అనే సినిమాలో ఐటెం సాంగ్ కి డ్యాన్స్ వేసిన ఆమె, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ పార్ట్ 2 రిలీజ్ అయి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఒక తమిళ సినిమాతో తెలుగులో శాకుంతలం, యశోద సినిమాల్లో నటిస్తోంది. ఇవి కాక మరిన్ని సినిమాలను కూడా ప్రకటించారు. ఇక కాజల్ అగర్వాల్ కూడా ఎప్పటిలాగే ఫిబ్రవరి నెలలో రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా మోసగాళ్లు అనే తెలుగు సినిమాలో కనిపించిన ఈ భామ ప్రస్తుతం నాలుగు తమిళ సినిమాలు, తెలుగులో ఆచార్య అనే సినిమాలో నటించింది. గర్భవతి కావడంతో రెస్ట్ మోడ్ లో ఉంది.

3- అనుష్కశెట్టి 4- పూజా హెగ్డే
సినిమాలలో కనిపించకున్నా అనుష్క ఫిబ్రవరి నెలలో మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా నిశ్శబ్దం అనే సినిమాలో కనిపించిన అనుష్క పుట్టిన రోజు సందర్భంగా యూవీ ప్రొడక్షన్స్ లో సినిమాని అనౌన్స్ చేసింది. ఇక ఇక బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఈ జాబితాలో నాలుగో స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన తెచ్చుకుంది.

5- సాయి పల్లవి 6- రష్మిక మందన్న
సాయి పల్లవి జనవరి నెలలో నాలుగో స్థానంలో ఉండగా ఫిబ్రవరికి ఒక స్థానం దిగజారి ఐదో స్థానానికి చేరింది. చివరిగా లవ్ స్టోరీ అనే సినిమాతో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి పల్లవి ఇప్పుడు విరాటపర్వం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. గీత గోవిందం భామ రష్మిక మందన్న ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. ఆమె చివరిగా అల్లు అర్జున్ సరసన పుష్ప అనే సినిమాలో కనిపించి హిట్ అందుకుంది. ఇక ఆమె బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటిస్తోంది.

7- కీర్తి సురేష్ 8-తమన్నా
కీర్తి సురేష్ ఈ జాబితాలో ఏడో స్థానాన్ని నిలబెట్టుకుంది. నిలిచింది. చివరిగా ఆమె గుడ్ లక్ సఖి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం తెలుగులో సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ జాబితాలో ఎనిమిదో స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా సీటీమార్, మాస్ట్రో సినిమాలలో నటించిన ఆమె ప్రస్తుతం తెలుగులో ఎఫ్ త్రీ, గుర్తుందా శీతాకాలం సినిమాల్లో కూడా నటిస్తోంది.

9- కృతి శెట్టి 10- రకుల్ ప్రీత్ సింగ్
ఇక ఈ జాబితాలో మొట్టమొదటి సారిగా కృతి శెట్టి ఎంట్రీ ఇచ్చింది. ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పుడు అనేక సినిమాల్లో భాగమైంది. కుర్ర హీరోలు అందరికీ ఏకైక ఆప్షన్ గా మారింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ పదో స్థానంలో నిలిచింది. చివరిగా కొండపొలం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ఇటీవలే తన ప్రియుడిని పరిచయం చేసి, వార్తల్లో నిలిచింది. ఇక బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications











