ఎందరు వచ్చినా తగ్గేదేలే అంటున్న సమంత.. టాలీవుడ్ నెం.1 ఇంకెవరూ కాలేరా?

టాలీవుడ్ హీరోయిన్లు ఇప్పుడు టాలీవుడ్ కే పరిమితం కాకుండా అన్ని భాషల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా తెలుగులో కూడా వారు విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. అయితే ప్రముఖ సర్వే సంస్థ ఆర్మాక్స్ మీడియా ఎప్పటి లాగానే మార్చి 2022కి గాను టాప్ 10 తెలుగు హీరోలు, హీరోయిన్స్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ సర్వేలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన తెలుగు హీరోగా ప్రభాస్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే తెలుగు హీరోలను ప్రకటించినట్టుగానే హీరోయిన్ జాబితాను కూడా రిలీజ్ చేయగా అందులో హీరోయిన్ల స్థానాలు ఎలా ఉన్నాయి అనేది పరిశీలిద్దాం.

1 - సమంత అక్కినేని 2 - కాజల్ అగర్వాల్

1 - సమంత అక్కినేని 2 - కాజల్ అగర్వాల్


టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ ఫిమేల్ కేటగిరీలో సమంత తనకు ఎవరూ పోటీలేరని నిరూపించుకుంటోంది. ప్రతి నెల లాగే మార్చి నెలలో కూడా మొదటి స్థానాన్ని సమంతా నిలబెట్టుకుంది. చివరిగా పుష్ప అనే సినిమాలో ఐటెం సాంగ్ కి డ్యాన్స్ వేసిన ఆమె ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ పార్ట్ 2లో నటించగా దానికి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఒక తమిళ సినిమాతో తెలుగులో శాకుంతలం, యశోద సినిమాల్లో నటిస్తోంది. ఇవి కాక మరిన్ని సినిమాలు కూడా ప్రకటించారు. ఇక కాజల్ అగర్వాల్ కూడా ఎప్పటిలాగే మార్చి నెలలో రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా మోసగాళ్లు అనే తెలుగు సినిమాలో కనిపించిన ఈ భామ ప్రస్తుతం నాలుగు తమిళ సినిమాలు, తెలుగులో ఆచార్య అనే సినిమాలో నటించింది. గర్భవతి కావడంతో ఆమె ప్రస్తుతానికి రెస్ట్ మోడ్ లో ఉంది. అయినా సోషల్ మీడియాను వదలడం లేదు.

3- అనుష్కశెట్టి 4- పూజా హెగ్డే

3- అనుష్కశెట్టి 4- పూజా హెగ్డే

సినిమాలలో కనిపించకున్నా అనుష్క మార్చి నెలలో మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా నిశ్శబ్దం అనే సినిమాలో కనిపించిన అనుష్క పుట్టిన రోజు సందర్భంగా యూవీ ప్రొడక్షన్స్ లో సినిమాని అనౌన్స్ చేసింది. ఇక ఇక బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఈ జాబితాలో నాలుగో స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె తాజాగా విజయ్ బీస్ట్ సినిమాలో కూడా కనిపించింది.

5- రష్మిక మందన్న 6- సాయి పల్లవి

5- రష్మిక మందన్న 6- సాయి పల్లవి

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. ఆమె చివరిగా అల్లు అర్జున్ సరసన పుష్ప అనే సినిమాలో కనిపించి హిట్ అందుకుంది. ఇక ఆమె బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటిస్తోంది. సాయి పల్లవి జనవరి నెలలో నాలుగో స్థానంలో ఉండగా ఫిబ్రవరికి ఒక స్థానం దిగజారి ఐదో స్థానానికి చేరగా ఇప్పుడు మరో స్థానం దిగజారింది. చివరిగా లవ్ స్టోరీ అనే సినిమాతో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి పల్లవి ఇప్పుడు విరాటపర్వం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

7- కీర్తి సురేష్ 8-తమన్నా

7- కీర్తి సురేష్ 8-తమన్నా


కీర్తి సురేష్ ఈ జాబితాలో ఏడో స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా ఆమె గుడ్ లక్ సఖి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం తెలుగులో సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ జాబితాలో ఎనిమిదో స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా సీటీమార్, మాస్ట్రో సినిమాలలో నటించిన ఆమె ప్రస్తుతం తెలుగులో ఎఫ్ త్రీ, గుర్తుందా శీతాకాలం సినిమాల్లో కూడా నటిస్తోంది.

Recommended Video

KGF Chapter 2 Records.. ఏ వెర్షన్ లో ఎంత ? | Filmibeat Telugu
9-రకుల్ ప్రీత్ సింగ్ 10- కృతి శెట్టి

9-రకుల్ ప్రీత్ సింగ్ 10- కృతి శెట్టి


రకుల్ ప్రీత్ సింగ్ ఈ జాబితాలో ఒక స్థానం ఎగబాకింది. చివరిగా కొండపొలం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ఇటీవలే తన ప్రియుడిని పరిచయం చేసి, వార్తల్లో నిలిచింది. ఇక బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. కండోమ్ టెస్టర్ గా ఆమె చేస్తున్న సినిమా చర్చనీయాంశం అవుతోంది. ఇక ఈ జాబితాలో మొట్టమొదటి సారిగా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ఇప్పుడు పడవ స్థానానికి పరిమితమైంది. ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పుడు అనేక సినిమాల్లో భాగమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X