తిరుగు లేదనిపించుకుంటున్న సమంత..టాలీవుడ్ క్వీన్ ప్లేస్ కొట్టే వాళ్ళే లేరా?
ప్రముఖ సర్వే సంస్థ ఆర్మాక్స్ మీడియా ఎప్పటి లాగానే మే 2022కి గాను టాప్ 10 తెలుగు హీరోలు, హీరోయిన్స్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ సర్వేలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన తెలుగు హీరోగా ప్రభాస్ మొదటి స్థానాన్ని సాధించారు. అయితే ఈసారి మహేష్ బాబు సెకండ్ ప్లేస్ కి వచ్చి చేరారు. తెలుగు హీరోలను ప్రకటించినట్టుగానే హీరోయిన్ జాబితాను కూడా రిలీజ్ చేయగా అందులో హీరోయిన్ల స్థానాలు ఎలా ఉన్నాయి అనేది పరిశీలిద్దాం.

1 - సమంత అక్కినేని 2 - కాజల్ అగర్వాల్
టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ ఫిమేల్ కేటగిరీలో సమంత తనకు ఎవరూ పోటీలేరని మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటోంది. ప్రతి నెల లాగే మే నెలలో కూడా మొదటి స్థానాన్ని సమంత నిలబెట్టుకుంది. పుష్ప అనే సినిమాలో ఐటెం సాంగ్ కి డ్యాన్స్ వేసిన ఆమె దేశం మొత్తం ఒక ఊపు ఊపింది. చివరిగా నయనతారతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె తెలుగులో శాకుంతలం, యశోద సినిమాల్లో నటిస్తోంది. ఇవి కాక మరిన్ని సినిమాలు కూడా ప్రకటించారు. ఇక కాజల్ అగర్వాల్ కూడా ఎప్పటిలాగే మే నెలలో రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా మోసగాళ్లు అనే తెలుగు సినిమాలో కనిపించిన ఈ భామ గత నెలలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

3- అనుష్కశెట్టి 4- పూజా హెగ్డే
బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. చివరిగా ఆమె విజయ్ సరసన బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన తెచ్చుకుంది. ఇక మరోపక్క సినిమాలలో కనిపించకున్నా అనుష్క మే నెలలో నాలుగో స్థానాల్లో నిలిచింది. చివరిగా నిశ్శబ్దం అనే సినిమాలో కనిపించిన అనుష్క పుట్టిన రోజు సందర్భంగా యూవీ ప్రొడక్షన్స్ లో సినిమాని అనౌన్స్ చేసింది.

5- కీర్తి సురేష్ 6-తమన్నా
కీర్తి సురేష్ ఈ జాబితాలో ఐదో స్థానానికి వచ్చింది. చివరిగా ఆమె సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించిన ఆ సినిమా మే నెలలోనే విడుదలయింది. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. చివరిగా ఎఫ్ త్రీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె గుర్తుందా శీతాకాలం సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించనుంది.

7- రష్మిక మందన్న 8 - సాయి పల్లవి
గీత గోవిందం భామ రష్మిక మందన్న ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. ఆమె చివరిగా అల్లు అర్జున్ సరసన పుష్ప అనే సినిమాలో కనిపించి హిట్ అందుకుంది. ఇక ప్రస్తుతం గ్యాప్ లేకుండా బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటిస్తోంది. సాయి పల్లవి ఈసారి ఎనిమిదో స్థానంలో నిలిచింది. స్థానానికి చేరింది. చివరిగా లవ్ స్టోరీ అనే సినిమాతో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి పల్లవి ఇప్పుడు విరాటపర్వం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.
Recommended Video


9- రకుల్ ప్రీత్ సింగ్ 10-కృతి శెట్టి
ఇక ఈ జాబితాలో రకుల్ ప్రీత్ సింగ్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. చివరిగా కొండపొలం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ఇటీవలే తన ప్రియుడిని పరిచయం చేసి, వార్తల్లో నిలిచింది. తెలుగులో లేవు కానీ ఆమె బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. ఇక ఈ మధ్యనే టాప్ టెన్ లోకి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ఈసారి పదో స్థానంలో నిలిచింది. ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పుడు అనేక సినిమాల్లో భాగమైంది. ఆమె నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, రామ్ ది వారియర్ సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











