విడాకుల తర్వాత కూడా టాలీవుడ్ నెం 1 సమంతే.. టాప్ టెన్ లిస్టులో కీలక మార్పులు... టాప్ 10లో ఎవరంటే?
ప్రముఖ సర్వే సంస్థ ఆర్మాక్స్ మీడియా ఈ ఏడాది సెప్టెంబర్ నెలకు గాను టాప్ 10 తెలుగు హీరోలు, హీరోయిన్స్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ సర్వేలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన తెలుగు హీరోగా మహేష్ బాబు మొదటి స్థానాన్ని నిలబెట్టుకోగా ఆ తర్వాత స్థానాన్ని అల్లు అర్జున్ కూడా తమ స్థానాలు నిలుపుకున్నారు. ఇక హీరోలను ప్రకటించినట్టుగానే హీరోయిన్ జాబితాను కూడా రిలీజ్ చేయగా అందులో కూడా దాదాపు పాత స్థానాలు మళ్ళీ నిలుపుకున్నారు హీరోయిన్లు. అయితే మరికొన్ని స్థానాలు మారాయి కూడా. ఆ వివరాల్లోకి వెళితే

1 - సమంత అక్కినేని 2 - కాజల్ అగర్వాల్
టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ ఫిమేల్ కేటగిరీలో సమంత ప్రతి నెల లాగే ఈ నెలలో కూడా మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా జాను అనే సినిమాలో కనిపించిన ఆమె, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ పార్ట్ 2 రిలీజ్ అయి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఒక తమిళ, అలాగే శాకుంతలం సినిమాల్లో నటిస్తోంది. విడాకుల ప్రకటన తరువాత ఆమె మరింత పాపులర్ అయింది. ఇక కాజల్ అగర్వాల్ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా మోసగాళ్లు అనే తెలుగు సినిమాలో కనిపించిన ఈ భామ ప్రస్తుతం నాలుగు తమిళ సినిమాలు చేస్తూ ఉండగా, తెలుగులో ఆచార్య అనే ఒక్క సినిమాలో మాత్రమే నటిస్తోంది.

3- అనుష్కశెట్టి 4- పూజా హెగ్డే
సినిమాలలో కనిపించకున్నా అనుష్క ఈ జాబితాలో కూడా మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా నిశ్శబ్దం అనే సినిమాలో కనిపించిన అనుష్క ఇప్పటికీ మరో సినిమాని అనౌన్స్ చేయలేదు. అయినా ఆమె లిస్టులో మూడో స్థానంలో నిలవడం గమనార్హం. ఇక ఇక బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఈ జాబితాలో ఏడో స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది. చివరిగా అల వైకుంఠ పురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమా చేస్తోంది. అలానే అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది.

5- తమన్నా 6- కీర్తి సురెష్
మిల్కీ బ్యూటీ తమన్నా ఈ జాబితాలో ఐదో స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా సీటీమార్, మాస్ట్రో సినిమాలలో నటించిన ఆమె ప్రస్తుతం తెలుగులో ఎఫ్ త్రీ, గుర్తుందా శీతాకాలం సినిమాల్లో కూడా నటిస్తోంది. అయితే కీర్తి సురేష్ ఈ జాబితాలో ఆరో స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ ఏడాది రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ ప్రస్తుతం తెలుగులో సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

7-రష్మిక మందన్న 8-రకుల్ ప్రీత్ సింగ్
గీత గోవిందం భామ రష్మిక మందన్న ఈ జాబితాలో ఏకంగా నాలుగో స్థానం నుంచి ఏడో స్థానానికి దిగజారింది. ఆమె చివరిగా సుల్తాన్ అనే సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ సరసన పుష్ప అనే సినిమాలో అలాగే బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ జాబితాలో ఎనిమిదో స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా కొండపొలం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ఇటీవలే తన ప్రియుడిని పరిచయం చేసింది.
Recommended Video

9 - రాశి ఖన్నా 10 -సాయి పల్లవి
సాయి పల్లవి పదో స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి ఎగబాకింది. చివరిగా లవ్ స్టోరీ అనే సినిమాతో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి పల్లవి ఇప్పుడు విరాటపర్వం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఇక ఈ నెలలో కొత్తగా అనుపమా పరమేశ్వరన్ ఈ జాబితాలో స్థానం దక్కించుకుంది. ఆమెకు ఈ జాబితాలో పదో స్థానం లభించింది. చివరిగా రాక్షసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె రౌడీ బాయ్స్, 18 పేజెస్, కార్తికేయ2, హెలెన్ సినిమాతో పలకరించనుంది.


Click it and Unblock the Notifications











