twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్రేజ్ తగ్గని సమంత.. నంబర్ 1 స్థానం కోసం వెంటాడుతున్న పూజా హెగ్డే.. టాప్ 10లో ఎవరున్నారంటే?

    |

    ప్రముఖ సర్వే సంస్థ ఆర్మాక్స్ మీడియా ఈ ఏడాది నవంబర్ నెలకు గాను టాప్ 10 తెలుగు హీరోలు, హీరోయిన్స్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ సర్వేలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన తెలుగు హీరోగా మహేష్ బాబు మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అలాగే ప్రభాస్ రెండో స్థానానికి చేరుకున్నారు. ఇక తెలుగు హీరోలను ప్రకటించినట్టుగానే హీరోయిన్ జాబితాను కూడా రిలీజ్ చేయగా అందులో కూడా దాదాపు పాత స్థానాలు మళ్ళీ నిలుపుకున్నారు హీరోయిన్లు. అయితే అందులో కొన్ని స్థానాలు మారాయి. ఎవరెవరి స్థానాలు నిలబడ్డాయి? ఎవరెవరికి మారాయి? అనే వివరాల్లోకి వెళితే..

     1 - సమంత అక్కినేని 2 - కాజల్ అగర్వాల్

    1 - సమంత అక్కినేని 2 - కాజల్ అగర్వాల్

    టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ ఫిమేల్ కేటగిరీలో సమంత ప్రతి నెల లాగే నవంబర్ నెలలో కూడా మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా జాను అనే సినిమాలో కనిపించిన ఆమె, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ పార్ట్ 2 రిలీజ్ అయి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఒక తమిళ సినిమాతో అలాగే శాకుంతలం సినిమాల్లో నటిస్తోంది. ఇవి కాక మరిన్ని సినిమాలను కూడా ప్రకటించారు. విడాకుల ప్రకటన తర్వాత ఆమె గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఇక కాజల్ అగర్వాల్ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా మోసగాళ్లు అనే తెలుగు సినిమాలో కనిపించిన ఈ భామ ప్రస్తుతం నాలుగు తమిళ సినిమాలు చేస్తూ ఉండగా, తెలుగులో ఆచార్య అనే ఒక్క సినిమాలో మాత్రమే నటిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది.

    3- అనుష్కశెట్టి 4- పూజా హెగ్డే

    3- అనుష్కశెట్టి 4- పూజా హెగ్డే

    సినిమాలలో కనిపించకున్నా అనుష్క నవంబర్ నెల జాబితాలో కూడా మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా నిశ్శబ్దం అనే సినిమాలో కనిపించిన అనుష్క మొన్న పుట్టిన రోజు సందర్భంగా యూవీ ప్రొడక్షన్స్ లో సినిమాని అనౌన్స్ చేసింది. అయితే అనుష్క లిస్టులో మూడో స్థానంలో నిలవడం గమనార్హం. ఇక ఇక బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఈ జాబితాలో నాలుగో స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా అలాగే అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ భామ ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమా చేస్తోంది. ఆ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

     5- కీర్తి సురేష్ 6- సాయి పల్లవి

    5- కీర్తి సురేష్ 6- సాయి పల్లవి

    కీర్తి సురేష్ ఈ జాబితాలో ఏడో స్థానం నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది ఈ ఏడాది అన్నాత్తే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ ప్రస్తుతం తెలుగులో సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తోంది. సాయి పల్లవి ఆరో స్ధానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా లవ్ స్టోరీ అనే సినిమాతో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి పల్లవి ఇప్పుడు విరాటపర్వం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

    7-తమన్నా 8-రష్మిక మందన్న

    7-తమన్నా 8-రష్మిక మందన్న

    మిల్కీ బ్యూటీ తమన్నా ఈ జాబితాలో ఐదో స్థానం నుంచి ఏడవ స్థానానికి దిగజారింది. చివరిగా సీటీమార్, మాస్ట్రో సినిమాలలో నటించిన ఆమె ప్రస్తుతం తెలుగులో ఎఫ్ త్రీ, గుర్తుందా శీతాకాలం సినిమాల్లో కూడా నటిస్తోంది. గుర్తుందా శీతాకాలం సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. గీత గోవిందం భామ రష్మిక మందన్న ఈ జాబితాలో ఎనిమిదో స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆమె చివరిగా సుల్తాన్ అనే సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ సరసన పుష్ప అనే సినిమాలో అలాగే బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటిస్తోంది.

    9 -రకుల్ ప్రీత్ సింగ్ 10 రాశి ఖన్నా

    9 -రకుల్ ప్రీత్ సింగ్ 10 రాశి ఖన్నా

    రకుల్ ప్రీత్ సింగ్ ఈ జాబితాలో తొమ్మిదో స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా కొండపొలం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ఇటీవలే తన ప్రియుడిని పరిచయం చేసి, వార్తల్లో నిలిచింది. నవంబర్ నెలలో మళ్లీ రాశి ఖన్నా పదో స్థానం దక్కించుకుంది. ఆమె ప్రస్తుతం పక్కా కమర్షియల్, థాంక్యూ, అనే తెలుగు సినిమాలలు చేస్తోంది.

    English summary
    Ormax Media has released the top ten list of Telugu actresses for november 2021. here is the list.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X