మహిళలు వైన్ లాంటి వారు.. అందుకే సెక్సీగా తయారవుతా.. సమంత

సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోయిన్లకు పెళ్లి జరిగిందంటే కెరీర్‌కు పుల్‌స్టాప్ పడినట్టే.. కానీ ఇలాంటి పరిస్థితికి సమంత అక్కినేని భిన్నంగా కనిపిస్తున్నది. పెళ్లికి ముందు కంటే ఆ తర్వాతనే సమంత అందం, అభినయం రెట్టింపైంది. విజయాలను అలవోకగా సొంతం చేసుకొంటూ కుర్ర హీరోయిన్లకు ధీటుగా సమాధానం ఇస్తున్నది. తాజాగా హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019 టైటిల్‌ను సొంతం చేసుకొన్నారు. ఆయా రంగాల్లో రాణిస్తున్న 40 ఏళ్ల లోపు మహిళలపై ఆన్‌లైన్ సర్వే నిర్వహించగా సమంతకు మొదటిస్థానం దక్కింది. ఈ సందర్భంగా ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ..

30 ఏళ్ల తర్వాతే మహిళలు

30 ఏళ్ల తర్వాతే మహిళలు

మహిళలు 30 ఏళ్ల తర్వాతే చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. మహిళలు వైన్ లాంటి వారు. వయసు పెరిగిన కొద్ది సెక్సీగా కనిపిస్తారు. 30 ఏళ్లు వచ్చే సరికి ఎలా ఉంటామో అనే విషయంపై భయపడొద్దు. అప్పుడే మరింత అందంగా పరిణితితో కనిపిస్తారు. నా కెరీర్ తొలినాళ్లలో పరిస్థితులను, విషయాలను హ్యాండిల్ చేయడం రాకపోయేది. అనుభవం, వయసు పెరిగే కొద్ది అన్ని విషయాలను అదుపులో పెట్టుకోవడం అలవాటైంది అని సమంత అన్నారు.

వయసుతోపాటు పరిణితి కూడా

వయసుతోపాటు పరిణితి కూడా

వయసుతోపాటు నా ఆలోచన విధానం మారింది. నేనొక మనసును స్పాంజ్‌లా మార్చుకొన్నాను. పలు విషయాలను గ్రహించడం, వాటిని అన్వయించుకోవడం మొదలుపెట్టాను. మ్యాగజైన్లు, పలు ఫ్యాషన్‌లు చూసి నేను ఎలా ఉండాలో నేర్చుకొన్నాను. ఇన్నేళ్ల తర్వాత నేను చాలా సహజంగా కనిపించడం మొదలుపెట్టాను. అందమనేది మనం ఇతరులను మెప్పించడం బట్టే ఉంటుందని బలంగా విశ్వసించడం మొదలుపెట్టాను అని సమంత పేర్కొన్నారు.

ఆ ట్రోలింగ్ నాకు గుర్తుంది

ఆ ట్రోలింగ్ నాకు గుర్తుంది

నేను ధరించే దుస్తుల విషయంలో జరిగిన ట్రోలింగ్ గురించి నాకు బాగా గుర్తుంది. నా పెళ్లి తర్వాత నా దుస్తులు గురించి బాగా ట్రోలింగ్ చేశారు. అత్యంత దారుణంగా నన్ను టార్గెట్ చేశారు. కానీ నా తరహాలోనే దుస్తులు వేసుకోవడంలో మార్పులు చేయలేదు. రెండోసారి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఒకసారి ట్రోలింగ్‌ను భరించాక రెండోసారి ఏమి కాదులేననే ధైర్యం తెచ్చుకొన్నాను. దానివల్లే మానసికంగా మరితం ధృడంగా తయారయ్యాను అని సమంత వెల్లడించారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Mahesh Babu To Host Bigg Boss Telugu After Jr NTR,Nani & Nagarjuna
దుస్తులనేటివి మూడ్‌ను బట్టి

దుస్తులనేటివి మూడ్‌ను బట్టి

నా వేషభాషల విషయంలో ప్రజలే తమ మైండ్ సెట్ మార్చుకొన్నారు. దుస్తులు అనేవి మనిషి క్యారెక్టర్‌కు సంబంధించినవి కావు. బాహ్య సౌందర్యానికి సంబంధించినవి. మనం ఆ రోజుకు ఎలా ఉన్నావో మన మూడ్‌ను ఇతరులకు మనం వేసుకొనే దుస్తులు చెబుతాయనే విషయాన్ని నమ్ముతాను. నా కాన్ఫిడెన్స్ కనిపిస్తే సెక్సీగా తయారవుతాను. అది కేవలం నా ఆత్మ సంతృప్తి కోసమే. అంతేకానీ మరొకరి కోసం నేను ఆకర్షణీయంగా తయారు కాను. నేను ధరించే దుస్తులు నా మూడ్‌కు సంబంధించినవని అనుకోవాలి అని సమంత చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X