సమంత 'ఓ బేబీ'.. స్టిల్స్ అదిరిపోయాయి!
అక్కినేని సమంత వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. గత ఏడాది రంగస్థలం, మహానటి, అభిమన్యుడు లాంటి విజయాలు సొంతం చేసుకున్న సమంత.. ఈ ఏడాది మజిలీ, ఓ బేబీ లాంటి చిత్రాల్లో నటిస్తోంది. సమంత నటిస్తున్న తాజాగా నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ఓ బేబి. కొరియన్ చిత్రం మిస్ గ్రానీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహిళా దర్శకురాలు నందిని రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియాలో వెల్లడించింది. కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొంటూ ఈ స్థాయికి చేరుకున్నానని సమంత తెలిపింది. ఓ బేబి తన కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం అని సమంత అభిప్రాయపడింది. నాకు ఇష్టమైన దర్శకురాలు నందిని ఈ పాత్రని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారని సమంత తెలిపింది. ఈ చిత్ర షూటింగ్ పూర్తయిన సందర్భంగా సమంత తన స్టిల్స్ ని పోస్ట్ చేసింది.

సమంత సోలోగా, సీనియర్ నటి లక్ష్మితో డాన్స్ చేస్తున్న స్టిల్స్ ని పోస్ట్ చేసింది. ఈ రెండు స్టిల్స్ చాలా బావున్నాయి. ఫోటో స్టూడియోకు వెళ్లిన ఓ వృద్ధురాలు తిరిగి బయటకు రాగానే తన పోలికలతో 20 ఏళ్ల యువతిని చూస్తుంది. వారి మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనేదే ఈ చిత్ర కథ. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











