సోషల్ మీడియాలో సమంత న్యూ రికార్డ్.. హీరోల కంటే గ్రేట్!
టాలీవుడ్ బ్యూటీ సమంత అక్కినేని ఏం చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కామన్ గా మారింది. పెళ్లి అయినా కూడా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇక వయసు పెరుగుతున్నా కూడా గ్లామర్ డోస్ తగ్గడం లేదు. మునుపటి కంటే ఎక్కువ స్థాయిలోనే అక్కినేని వారి కోడలు గ్లామర్ ఫొటోస్ తో రచ్చ చేస్తోంది.
ఇక రీసెంట్ గా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఒక అరుదైన రికార్డును అందుకుంది. ఇన్స్టాగ్రామ్ లో తన ఫాలోవర్స్ సంఖ్యను 11 మిలియన్స్ కి పెంచుకుంది. ఇటీవల కాలంలో సమంత ఎక్కువగా పోస్టులు చేయకపోయినప్పటికి మిలియన్ ఫాలోవర్స్ చేరారు. మొన్న పూజా హెగ్డే ఇదే తరహాలో 11 మిలియన్స్ ఫాలోవర్స్ రికార్డును అందుకున్న విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు సమంత కూడా అదే స్పీడ్ తో కుర్ర హీరోయిన్ కి పోటీని ఇస్తోంది. ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ అందాల డోస్ ఎంత పెంచుతున్నా కూడా సమంతను మాత్రం డామినేట్ చేయడం లేదు. చాలా వరకు సినిమాలు తగ్గించిన సమంత వీలైనంత వరకు లేడి ఓరియెంటెడ్ కాన్సెప్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.
కొడితే సోలోగానే హిట్ అందుకోవాలని హీరోల కంటే హై రేంజ్ లో ఆలోచిస్తోంది. ఇక ఇప్పుడు అమ్మడు హీరోల కంటే గ్రేట్ అనే విధంగా సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది.


Click it and Unblock the Notifications











