twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాన్ ఇండియా సినిమాలో సమంత.. రెమ్యునరేషన్ నాగ చైతన్య కంటే ఎక్కువే?

    |

    అక్కినేని వారి కోడలు సమంత పెళ్లి తరువాత కూడా స్టార్ హీరోయిన్ అనే బ్రాండ్ ఇమేజ్ ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది. సాధారణంగా కొంత మంది హీరోయిన్స్ పెళ్లి తరువాత చాలా వరకు సినిమాలు తగ్గించేస్తారు. అవకాశాలు రావాడం కూడా తగ్గుతుంటాయి. కానీ సమంత కెరీర్ లో మాత్రం అలాంటివేమి జరగలేదు. ఓ విధంగా ఆమె రేంజ్ ఇంకా పెరిగిందనే చెప్పాలి. నెక్స్ట్ ఒక బాలీవుడ్ పాన్ ఇండియా సినిమాతో రాబోతోంది.

    Recommended Video

    Samantha Fans Demand Apologize From Pooja Hegde
    సమంత కూడా.. పాన్ ఇండియా

    సమంత కూడా.. పాన్ ఇండియా

    పాన్ ఇండియా అనేది ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీలో వినిపిస్తున్నదే. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలు చాలా మంది పాన్ ఇండియా అనేస్తున్నారు. ఇక హీరోయిన్స్ కూడా లేడి ఓరియెంటెడ్ సినిమాలతో వారి టాలెంట్ చూపిస్తున్నారు. అనుష్క తరువాత సమంత కూడా బాలీవుడ్ లో కూడా క్రేజ్ అందుకోవాలని ట్రై చేస్తోంది.

    సక్సెస్ అందుకున్న తరువాత..

    సక్సెస్ అందుకున్న తరువాత..

    మజిలీ, ఓ బేబి వంటి డిఫరెంట్ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకున్న తరువాత జాను సినిమాతో అమ్మడు కాస్త డీలా పడింది. ఇక నెక్స్ట్ మంచి కాన్సెప్ట్ లతో క్లిక్కవ్వాలని ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఫ్యామిలి మ్యాన్ సెకండ్ సీజన్ లో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ వెబ్ సిరిస్ సెకండ్ సీజన్ మరికోన్నీ రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

    బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్..

    బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్..

    అయితే ఇదే సమయంలో అమ్మడికి బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్ దక్కింది. సోని పిక్చర్స్ లో తెరకెక్కుతున్న లేడి ఓరియెంటెడ్ పాన్ ఇండియా సినిమాలో సమంతను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగు తమిళ్ హిందీ మలయాళం భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఆ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు సమాచారం.

    నాగ చైతన్య కంటే ఎక్కువే..

    నాగ చైతన్య కంటే ఎక్కువే..

    అయితే దర్శకుడు ఎవరన్నది ఇంకా బయటకు రాలేదు. ఇక సినిమా కోసం సమంత భారీ రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఓ విధంగా తన భర్త నాగ చైతన్య కంటే కూడా ఆ ఎమౌంట్ ఎక్కువే అని తెలుస్తోంది. చైతన్య ఒక్కో సినిమాకు 8 నుంచి 10కోట్లు అందుకుంటున్నాడు. ఇక సమంతకు పాన్ ఇండియా సినిమా కాబట్టి 10కోట్ల కంటే ఎక్కువే ఇవ్వనున్నారని సమాచారం.

    English summary
    Even after their marriage to Samantha, Akkineni is still maintaining the brand image of a star heroine. Usually some heroines cut down on movies after the wedding. Opportunities are also reduced. But nothing happened in Samantha's career. In a way, her range has increased. Next up is a Bollywood Pan India movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X