సమంత ఏంటి ఇలాంటి ఫొటో షేర్ చేసింది.. హాట్ టాపిక్‌గా మారిన అక్కినేని వారి కోడలు

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ సెలెబ్రిటీలపై ట్రోల్స్ రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. కొందరు తమకు ఇష్ట లేని వారిపై విమర్శలు సంధిస్తుండగా.. మరికొందరు మాత్రం కాలక్షేపానికి ఏవేవో పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతూ ఉంటారు. ఇవి ఒక్కోసారి శృతి మించిపోతున్నాయి. చాలా మంది సోషల్ మీడియా ట్రోల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా.. ట్రోలింగ్స్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇక, తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి ట్రోల్ అవుతోంది. అయితే, దీనికి కారణం షేర్ చేసిన ఫొటోనే.

సోషల్ మీడియాలో యమ యాక్టివ్

సోషల్ మీడియాలో యమ యాక్టివ్

టాలీవుడ్‌లో ఎన్నో సంవత్సరాలుగా వరుస విజయాలతో దూసుకుపోతోంది అక్కినేని వారి కోడలు సమంత. ఆమె సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటోంది. అంతేకాదు, తన ఫొటోలు, వీడియోలు కూడా తరచూ షేర్ చేస్తోంది. దీంతో సమంత ఫాలోవర్స్ క్రమక్రమంగా పెరిగిపోతున్నారు.

సమంతకు కొత్త కాదు

సమంతకు కొత్త కాదు

సమంతకు ట్రోల్స్ కొత్తేం కాదు. గతంలో ఆమె షేర్ చేసిన ఫొటోలు, వీడియోలపై నెటిజన్లు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇక, పెళ్లైన తర్వాత ఆమెపై విమర్శలు ఎక్కువవుతూనే ఉన్నాయి. వీటిపై సమంత కూడా చాలా సార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా.. ట్రోల్స్ మాత్రం తగ్గడం లేదు. ఈ మధ్య ఆమె సోషల్ మీడియాకు కొంచెం దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక, ఇటీవల ఆమె విదేశాల్లో ఎంజాయ్ చేస్తోంది. దానికి సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తోంది.

మామ పుట్టినరోజు కోసం

నాగార్జున పుట్టినరోజు వేడుక కోసం అక్కినేని ఫ్యామిలీ ఇటీవల విహారయాత్ర కోసం స్పెయిన్‌లోని ఐబిజాకు వెళ్లారు. ప్రస్తుతం నాగచైతన్య, సమంత, అఖిల్‌, నాగార్జున, అమల తదితరులు ఐబిజా ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా సమంత కూడా ఎన్నో ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తోంది. అలాగే, టూర్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.

సమంత ఫొటో చూసి షాక్ అవుతున్నారు

సమంత ఫొటో చూసి షాక్ అవుతున్నారు

తాజాగా సమంతకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటో చూసిన వారందరూ షాక్‌కు గురవుతున్నారు. దీనికి కారణం ఇందులో సమంత మరీ బక్క చిక్కినట్లు కనిపించడమే. ఈ ఫోటోలో సమంత రూపం దారుణంగా ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీంతో ఈ పిక్ హైలైట్ అవుతోంది. ఈ ఫొటో కింద ఓ నెటిజన్ ‘ఎండిపోయిన ఉప్పు చేపలా ఉన్నావ్' అని కామెంట్ చేయడం విశేషం.

ఏం చేయబోతుంది..?

ఏం చేయబోతుంది..?

సమంత ‘ఓ బేబి' సినిమా తర్వాత ‘96' రీమేక్ మినహా మరే సినిమాలోనూ నటించడం లేదు. అయితే, ఆమె వెబ్ సిరీస్ చేయబోతుందని కొందరు అంటుండగా.. మరికొందరు మాత్రం మరో సినిమాను రీమేక్ చేస్తుందని చెబుతున్నారు. ఇంకొందరైతే గర్భవతి కావడానికి సమంత సినిమాల నుంచి విరామం తీసుకోబోతుందని అంటున్నారు. దీంతో సమంత ఏం చేయబోతుందన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X