అలా డిస్టర్బ్ అయ్యా.. పిచ్చి పట్టిందా అనిపించింది.. సమంత
సినీ పరిశ్రమలో సమంత అక్కినేనికి ఎంతైతే ఫ్యాన్స్ ఉన్నారో.. అంతకంటే ఎక్కువ సోషల్ మీడియాలో ఆమెకు క్రేజ్ కనిపిస్తుంటుంది. అయితే కొన్ని సార్లు సమంత చేసిన పోస్టులు వివాదాస్పందంగా మారుతున్నాయి. వెకేషన్‌కు వెళ్లినప్పుడు సేద తీరుతూ ఫొటోలను పోస్ట్ చేస్తే నెటిజన్లు ట్రోల్స్ దుమ్మెత్తి పోసిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి ట్రోల్స్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత స్పందించారు. తనపై జరిగిన ట్రోల్స్ దాడి గురించి మాట్లాడుతూ..

ఉదయాన్ని లేచి ట్రోల్స్ గురించి
ఆరంభంలో ట్రోల్స్ నన్ను బాగా బాధించేవి. ట్రోల్స్ చూసినప్పుడు నాకేమైనా పిచ్చిపట్టిందా అని అనుకొనే దానిని. ట్రోల్స్ నేను చాలా డిస్టర్బ్ అయ్యే దానిని. ఆ సమయంలో ఉదయాన్ని లేచి ముందు సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోల్స్ వచ్చాయో చూసుకొనేదానిని. ఆ ట్రోల్స్ నా మానసిక పరిస్థితిని దెబ్బతీసేలా ఉండేవి. వాటి ప్రభావంతో తప్పు మీద తప్పు చేసిన దాఖలాలు ఉన్నాయి అని సమంత అక్కినేని అన్నారు.

ట్రోల్స్‌తో విపరీతమైన దాడితో
సోషల్ మీడియాలో నన్ను టార్గెట్‌గా చేసుకొని దాడులు (ట్రోల్స్) జరుగుతున్నప్పుడు పరిస్థితి దారుణంగా మారేది. అప్పుడు నేను ఎవరి నుంచి సలహాలు తీసుకొనే దానిని కాను. అలాగే వివరణ కూడా ఇచ్చేందుకు ఇష్టపడేదానిని కాదు. కానీ ఇప్పుడు ఆ క్షణాలను తలుచుకొంటే ఫన్‌గా అనిపిస్తుంటుంది. నాపై తీవ్రమైన ట్రోలింగ్ జరిగినా నేను బదులు ఇవ్వొద్దని అనుకొనేందానిని. వాటిని చూస్తూ నవ్వుకొనేదానిని అని సమంత తెలిపారు.

ట్వీట్, ఫొటో పోస్టు గానీ
ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా ట్వీట్ గానీ, ఫొటో పోస్టు గానీ చేసే ముందే నాకు ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ఎలాంటి ట్రోల్స్ వస్తాయనే విషయం కూడా అర్ధమవుతుంది. నేను ఏదైనా ఫోటో పడితే ఏం జరుగుతుందో అనే విషయం కూడా తెలిసిపోతుంది అని సమంత పేర్కొన్నారు. ఇటీవల కాలంలో సమంత చేసిన పోస్టు చేసిన ఫొటోలను నెటిజన్లు చీల్చిచెండాడిన విషయం తెలిసిందే.

జూలై 5వ తేదీన విడుదల
వరుస విజయాలతో దూసుకెళ్తున్న సమంత ప్రస్తుతం ఓ బేబీ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు నందినిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొరియన్ మూవీ మిస్ గ్రానీ సినిమా ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఈ సినిమాలో 70 ఏళ్ల ముసలి పాత్రలో సమంత కనిపిస్తారు. ఈ చిత్రం జూలై 5వ తేదీన రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











