twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్లైన హీరోయిన్లకు ఆ రకమైన బాధ.. అందుకే ప్రెగ్నెంట్ కావొద్దని.. సమంత

    |

    తెరపైనే కాదు.. నిజ జీవితంలో కూడా చాలా ధృడమైన మనస్తత్వంతో కనిపిస్తారు సమంత. తనకు నచ్చే విధంగా స్వేచ్ఛగా జీవించాలనుకోవడానికి వెనుకాడరు. తన నచ్చినట్టు ఉండటం, సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితాన్ని వెల్లడించడం లాంటి అంశాలు తరుచూ ట్రోలింగ్‌కు టార్గెట్ అవుతాయి. తాజాగా ఆమె ప్రెగ్నెన్సీపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. తాజాగా ఓ బేబి సినిమా ప్రమోషన్‌లో భాగంగా సమంత ట్రోలింగ్ విషయంపై స్పందించారు. ఆమె ఏమన్నారంటే..

    పెళ్లి తర్వాత హీరోయిన్లకు ఆ రకమైన బాధ

    పెళ్లి తర్వాత హీరోయిన్లకు ఆ రకమైన బాధ

    పెళ్లి తర్వాత హీరోయిన్లు రకరకాల ట్రోల్స్‌కు గురి అవ్వడం సర్వసాధారణంగా మారింది. ప్రెగ్నెన్సీ, ఇతర విషయాలు సహజంగానే చర్చకు వస్తాయి. నేను నా ఫ్రెండ్స్‌ను కలిస్తే పిల్లలను కనడానికి ఎప్పుడూ ప్లాన్ చేస్తున్నావని అడుగుతాను. అందులో తప్పేముంది? పెళ్లి తర్వాత సాధారణంగా చర్చకు వచ్చే ప్రశ్న ఇది. హీరోయిన్ల వరకు వచ్చే సరికి చాలా ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుంది. ట్రోలింగ్ విషయానికి వస్తే.. నన్ను టార్గెట్ చేయడానికి వేరే విషయాలు లేవు కనుక ఇలాంటి వాటిపై నెటిజన్లు దృష్టిపెడుతున్నారని అనుకొంటాను అని సమంత చెప్పారు.

    నా వ్యక్తిగత విషయాలపై

    నా వ్యక్తిగత విషయాలపై

    నటిగా నేను ఆకట్టుకొంటున్నప్పటీకి.. నేను ధరించే దుస్తులపై, నా వ్యక్తిగత విషయాలపై నెటిజన్లు కామెంట్లు చేయడం పట్టించుకోను. తప్పుగా ఆలోచిస్తే.. తప్పుగా చూస్తే ప్రతీ నెగిటివ్‌గానే కనిపిస్తుంది. అందుకే నేను ఎక్కువగా ఆలోచించను. పరిస్థితుల మారుతున్నాయి. వాటికి అనుగుణంగా మనం కూడా మారుతూనే ఉండాలి. పట్టించుకోకపోతే ఎలాంటి సమస్యలు ఉండవు అని సమంత పేర్కొన్నారు.

    ఈ ఏడాది ప్రెగ్నెంట్ కావొద్దని అనుకొన్నా

    ఈ ఏడాది ప్రెగ్నెంట్ కావొద్దని అనుకొన్నా

    ఓ బేబీ సినిమా చేసిన తర్వాత నా జీవితంపై పూర్తి అవగాహన కలిగింది. ఈ ఏడాది ప్రెగ్నెంట్ కావొద్దని అనుకొన్నాను. వచ్చే ఏడాది ప్లాన్ చేద్దామని అనుకొన్నాను. అందుకు నా ఫ్యామిలీ కూడా సపోర్ట్ కూడా చేస్తున్నది. ఈ తరం అమ్మాయిల్లో ఇలాంటి స్వేచ్ఛ ఉండేది. ఇదే విషయాన్ని నా తల్లిని అడిగాను.. మీ కాలంలో మీకు ఎలాంటి స్వేచ్ఛ ఉండేది? మీకు ఇష్టం ఉండేదా? మీ గోల్స్ ఏంటని మా తల్లిని అడిగాను. అయితే ఇలాంటి ఇప్పుడు ఎందుకని ప్రశ్నను దాటవేసింది అని సమంత తెలిపింది.

    మాతృత్వం నిస్వార్ధమైనది జీవితం

    మాతృత్వం నిస్వార్ధమైనది జీవితం

    మాతృత్వం అంటే నిస్వార్ధమైన ప్రేమ. నా తండ్రి ఫలానా ఉద్యోగం చేస్తారని చెప్పుకొంటాం. కానీ మా అమ్మ హౌజ్ వైఫ్ అని ప్రత్యేకంగా ఆమె సేవలను చెప్పుకోం. అలా తల్లి నిస్వార్ధంగా సేవ చేస్తున్నది. ఓ బేబీ కొరియా భాషలో చూసిన తర్వాత మా అమ్మ అందించిన ప్రేమ, సేవ గురించి అడిగితే ఓ రకంగా చూసింది. ఓ బేబీ సినిమా చేసిన తర్వాత తల్లి పాత్ర ఎంత గొప్పదో అర్ధమైంది. మరోసారి ఓ బేబి సినిమాకు థ్యాంక్స్ చెప్పుకొంటాను అని సమంత అన్నారు.

    English summary
    Samantha Akkineni is facing a critical situation after marriage. She said, I am not getting offers after Marriage. film offers dried up when she announced her marriage with Naga Chaitanya. Now She is doing Oh! baby and Manmadhudu movies. She spoke to media, on behalf of movie release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X