బన్నీ సినిమాను రిజెక్ట్ చేసిన సమంత.. ఎందుకు ఒప్పుకోలేదంటే?
అల్లు అర్జున్ లాంటి స్టైలిష్ స్టార్ తో సినిమా అంటే ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా ఒప్పుకోవాల్సిందే. బన్నీతో వర్క్ చేసిన హీరోయిన్స్ చాలా వరకు మంచి కెరీర్ ని సెట్ చేసుకున్నారు. అయితే ఇటీవల ఒక హీరోయిన్ మాత్రం అతనితో నటించే ఛాన్స్ రాగా ఉహీంచని విధంగా రిజెక్ట్ చేసిందట. ఆ సినిమా మరేదో కాదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప.
పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే రష్మిక కంటే ముందు చాలా మంది హీరోయిన్స్ ని చూసిన సుకుమార్ ముందుగా సమంతను అనుకున్నాడట. కానీ ఆమెకు అప్పుడు పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు ఎక్కువగా ఉండడంతో చేయలేనని చెప్పేసిందట.

కథ నచ్చలేక కూడా రిజెక్ట్ చేసిందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియదు గాని రష్మిక మందన్న మాత్రం మంచి ఆఫర్ దక్కించుకుంది. మొన్నటివరకు ఒక స్టేజ్ లో ఉన్న ఈ బ్యూటీ మహేష్ సరిలేరు నీకెవ్వరుతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి పెరిగింది. ఇక పుష్ప పాన్ ఇండియా కావడంతో మరో స్థాయికి వెళ్లే అవకాశం దక్కింది. మరి ఈ సినిమాతో అమ్మడు ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











