For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Samantha Akkineni Remuneration: ఓటీటీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం పొందిన నటిగా సమంత రికార్డ్.. తగ్గేదేలే!

  |

  అక్కినేని కోడలు సమంత ఫ్యామిలీ మ్యాన్ సీజన్-2తో ఓటీటీలోకి ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. ఆమె ఈ సిరీస్ లో అనేక ఇబ్బందులు ఎదుర్కొని తమిళ ఈలం సంస్థ కోసం పనిచేసే రాజీ అనే పాత్రలో కనిపించి ఆమె అలరించింది. రాజీ పాత్రలో ఆమె నటన అందరికీ నచ్చేసింది. దీంతో ప్రేక్షకుల నుంచే కాక సహ నటులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ సిరీస్ చేయడానికి గాను సమంత తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది వివరాల్లోకి వెళితే.

  చీర కట్టులో ఎద అందాలతో కవ్విస్తోన్న అందాల 'నిధి'

   ద ఫామిలీ మ్యాన్

  ద ఫామిలీ మ్యాన్

  తెలుగు దర్శక ద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే తెరకెక్కించిన ది ఫ్యామిలీ మాన్ సిరీస్ మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఫిబ్రవరిలో రిలీజ్ కావాల్సి ఉన్న ఈ రెండవ భాగం అనుకోని కారణాలతో ఈనెల 4వ తేదీన ఆమెజాన్ ప్రైం వీడియోలో రిలీజ్ అయింది.. ఈ సిరీస్ విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా సమంత, మనోజ్ బాజ్ పేయి ఇద్దరి నటన ప్రేక్షకులకు బాగా నచ్చింది.

  భారీ రెమ్యునరేషన్

  భారీ రెమ్యునరేషన్

  అయితే ఈ సిరీస్ చేయడానికి గానూ సమంత తన కెరీర్లోనే భారీ ఎత్తున రెమ్యూనరేషన్ తీసుకుందని అంటున్నారు. నిజానికి ఈ సమంత ఈ మధ్య కాలంలో పెద్దగా సినిమాలు ఒప్పుకోవడం లేదు. ఓ బేబీ సినిమాతో హిట్ అందుకున్న సమంత ఆ తర్వాత శర్వానంద్ హీరోగా వచ్చిన జాను అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా నిరాశపరచడంతో ఆమె మళ్లీ సినిమా ఒప్పుకోవడానికి చాలా సమయం పట్టింది.

   సినిమాల మీద నో ఫోకస్

  సినిమాల మీద నో ఫోకస్

  ప్రస్తుతం సమంత నయనతార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక తమిళ సినిమా అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే తెలుగు సినిమా చేస్తోంది. అయితే సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టని ఈ భామ తనకు వచ్చిన మొట్టమొదటి డిజిటల్ అవకాశాన్ని వదులుకోలేదు. ముందు ఈ పాత్ర తాను చేయగలనా లేదా అని కాస్త సందిగ్థంలో ఉన్న ఆమె, ఈ పాత్ర చేయడానికి ధైర్యం చేసి ముందుకు వెళ్ళింది. కాస్త బోల్డ్ సన్నివేశాల్లో కనిపించాల్సి వస్తుందని ముందే తెలిసినా సరే అన్నిటికీ సిద్ధమై శారీరకంగా కూడా ధారుడ్యం పెంచుకుని మరి పాత్ర కోసం సిద్ధపడింది.

  ఇండియాలోనే టాప్ మోస్ట్

  ఇండియాలోనే టాప్ మోస్ట్

  అంత కష్టపడింది కాబట్టి ఈ పాత్ర చేసినందుకుగాను సమంత ఏకంగా నాలుగు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఇక ఈ రెమ్యునిరేషన్ భారతీయ డిజిటల్ రంగంలో ఇప్పటిదాకా మరో నటి అందుకోలేదని తెలుస్తోంది. ఆమె పడిన కష్టానికి తగ్గట్టుగానే రెమ్యునరేషన్ ఇచ్చారని ఈ విషయంలో సమంత ఆనందం వ్యక్తం చేసిందని అంటున్నారు. తమిళనాడు నుంచి రిలీజ్ కి ముందు కొంత వివాదం రేగినా, రిలీజ్ అయ్యాక మాత్రం పెద్దగా ఆ ఇబ్బంది లేదనే చెప్పాలి.

   సామ్ జామ్ తో ముందే

  సామ్ జామ్ తో ముందే

  నిజానికి సమంత ఇందులో నటించడానికి కంటే ముందే ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. కానీ నటిగా కాదు ఒక టాక్ షోకి హోస్ట్ గా. సామ్ జామ్ అనే ఒక టాక్ షో ద్వారా ఆమె ఆహా ఓటీటీ ద్వారా డిజిటల్ ప్రేక్షకులకు పరిచయమైంది.. సుమారు ఎనిమిది ఎపిసోడ్స్ చేయగా ఆ ఎనిమిది ఎపిసోడ్స్ కి గాను ఆమె కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. అయితే కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఆమెకి తక్కువే అయినా సరే డిజిటల్ ఎంట్రీ విషయంలో వచ్చిన మొదటి ఆఫర్ కావడంతో ఆమె వెనక్కి తగ్గకుండా దాన్ని పూర్తి చేసినట్లు సమాచారం.

   సినిమాల లైనప్

  సినిమాల లైనప్

  ఇక సమంత ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆమె ఇప్పటికే నయనతార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరో పక్క గుణశేఖర్ తెరకెక్కిస్తున్న తెలుగు పురాణాలకు సంబంధించిన శాకుంతలం అనే సినిమాలో కూడా ఆమె లీడ్ రోల్ లో నటిస్తోంది. ఓ బేబీ దర్శకురాలు నందిని రెడ్డితో ఆమె ఒక హారర్ ఫిలిం కూడా చేస్తోందని ప్రచారం జరుగుతోంది. దీని మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

  English summary
  Samantha Akkineni's debut digital series The family man started streaming in amazon prime video. as per latest reports she pocketed big bucks for starring in The Family Man 2. Samantha took home a big fat paycheque of Rs 4 crores, which makes her one of the highest paid actresses in the Indian OTT industry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X