హద్దుల్ని చెరిపేశాను.. రూల్స్ బ్రేక్ చేశాను.. సమంత తెగింపు

దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్రతారగా రాణిస్తున్న సమంత అక్కినేని ప్రస్తుతం డిజిటల్ మీడియంలోకి అడుగుపెట్టారు. ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న ది ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్‌లో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సీజన్ 1 ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకొన్నారు. ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తే పాత్రలో కనిస్తున్నట్టు సమాచారం. తన పాత్ర గురించి సమంత జాతీయ మీడియాకు వివరిస్తూ..

ఓటీటీ ద్వారా ప్రపంచ సినిమాలోకి

ఓటీటీ ద్వారా ప్రపంచ సినిమాలోకి

ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్రతీ యాక్టర్‌కు, టెక్నిషియన్‌కు అనూహ్యంగా అవకాశాలు పెరిగాయి. సినిమా రంగంలో యాక్టర్లు కొన్ని పాత్రలకే పరిమితం అవుతారు. అయితే ఓటీటీలో అలాంటి ఇమేజ్‌కు సంబంధించిన సమస్యలు ఉండవు. ఏ నటుడైనా, నటి అయినా తనకు నచ్చిన పాత్రలను పోషించడానికి, ప్రయోగాలు చేయడానికి వేదికగా మారాయి అంటూ సమంత చెప్పారు.

గత పదేళ్లలో ఊహించని మార్పులు

గత పదేళ్లలో ఊహించని మార్పులు

సినీ పరిశ్రమలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. మహిళలకు సంబంధించి పరిస్థితుల్లో ఊహించని మార్పులు చేసుకొన్నాయి. నేను తొలిసారి సినీ రంగంలోకి అడుగుపెట్టిన పరిస్థితులను చూసుకొంటే మార్పుల పరంగా భూమి, ఆకాశాలకు ఉన్న వ్యత్యాసం కనిపిస్తుంది. మహిళలకు మంచి గౌరవం దక్కుతుంది అంటూ సమంత అన్నారు.

ఓటీటీలో స్టార్ హీరోల సత్తా

ఓటీటీలో స్టార్ హీరోల సత్తా

ప్రపంచ సినిమా రంగంలోకి ప్రవేశించడానికి ఓటీటీలు చక్కటి మార్గం. ఈ రంగంలో అవకాశాలు, ఎంపిక చేసుకొనే మార్గాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకు ఉదహరణకు సైఫ్ ఆలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ, మనోజ్ బాజ్‌పేయ్, టిస్కా చోప్రా, దివ్యదత్తా లాంటి తారలు ఓటీటీల్లో అద్బుతంగా రాణిస్తున్నారు అని సమంత పేర్కొన్నారు.

ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కోసం

ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కోసం

ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కోసం నటిగా నాకు ఉన్న హద్దులను చెరిపేశాను. ఇప్పటి వరకు ఫాలో అయిన నిబంధనలను తుంగలో తొక్కేశాను. ఈ వెబ్ సీరిస్‌తో నా కెరీర్‌లో ఓ అధ్బుతమైన ప్రయోగం చేయబోతున్నాను. ది ఫ్యామిలీ మ్యాన్ అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. నాకు పూర్తిస్థాయి సంతృప్తి లభించింది అని సమంత చెప్పారు.

Recommended Video

#NC20 : Naga Chaitanya's New Film Thank You Movie Opening | Vikram K Kumar
త్వరలోనే ఫ్యామిలీ మ్యాన్ సీరిస్ 2

త్వరలోనే ఫ్యామిలీ మ్యాన్ సీరిస్ 2

ఓటీటీలో లక్షలాది మందిని ఆకట్టుకొన్న ది ఫ్యామిలీ మ్యాన్‌కు కొనసాగింపుగా రెండో సీజన్ వస్తున్నది. యాక్షన్, డ్రామా, స్పస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, ప్రియమణి, షరీబ్ హష్మీ, దర్శన్ కుమార్, శరద్ ఖేల్కర్, సన్నీ హిందూజా, శ్రేయ ధన్వంతరి, షాబాబ్ అలీ, వేదాంత్ సిన్హా, మహేష్ ఠాకూర్ తదితరులు నటించారు. రాజ్ అండ్ డీకే నిర్మించి దర్శకత్వం వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X