హోస్టుగా సమంత సరికొత్త రికార్డు: ఆ షో కోసం భారీ రెమ్యూనరేషన్.. టాలీవుడ్‌లోనే మొదటిసారి ఇలా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలంగా తన హవాను చూపిస్తూ దూసుకుపోతోంది స్టార్ హీరోయిన్ సమంత. అందానికి అందం.. నటనకు నటన కనబరుస్తూ సత్తా చాటుతోన్న ఈ బ్యూటీ.. టాలీవుడ్‌లోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ వరుస విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే 'సామ్ జామ్' షోతో హోస్టుగానూ ఎంట్రీ ఇచ్చింది. ఈ షో కోసం సమంత తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. దీంతో ఆమె పేరిట రికార్డు నమోదైంది. ఆ వివరాలు మీకోసం!

అక్కడా... ఇక్కడా వరుసగా... దానితో బ్రేక్

అక్కడా... ఇక్కడా వరుసగా... దానితో బ్రేక్

తెలుగుతో పాటు తమిళంలో వరుసగా విజయాలను అందుకుంటూ దూసుకుపోతోంది సమంత. ఇలాంటి సమయంలో గత ఏడాది ఆమె 'జాను' అనే సినిమా చేసింది. తమిళంలో సూపర్ హిట్ అయిన '96'కు రీమేక్‌గా వచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. ఫలితంగా సామ్ విజయాల పరంపరకు బ్రేక్ పడిపోయింది. ఇక, ఇప్పుడు ఆమె చిత్రాలేవీ పట్టాలపై లేవు.

ఒక వెబ్ సిరీస్.. ఒక పాన్ ఇండియా మూవీ

ఒక వెబ్ సిరీస్.. ఒక పాన్ ఇండియా మూవీ

వెండితెరపై అదరగొట్టిన సమంత.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ వరల్డ్‌లోకి అడుగు పెట్టింది. ఇందులో ఆమె నెగెటివ్ పాత్రలో నటిస్తోంది. ఫిబ్రవరి నుంచి ఇది స్ట్రీమ్ కాబోతుంది. ఇక, 'జాను' తర్వాత సమంత మరో సినిమాను ప్రకటించలేదు. కానీ, ఇటీవల గుణశేఖర్‌ రూపొందించనున్న 'శాకుంతలం' అనే పాన్ ఇండియా ప్రాజెక్టులో ఆమె నటిస్తున్నట్లు ప్రకటించారు.

బిగ్ బాస్ షో ట్రయల్.. సామ్ జామ్ అంటూ

బిగ్ బాస్ షో ట్రయల్.. సామ్ జామ్ అంటూ

బిగ్ బాస్ షో ట్రయల్.. సామ్ జామ్ అంటూ
వర్క్ పట్ల ఎంత సీరియస్‌గా ఉంటుందో.. మామూలుగా ఎంతో అల్లరి చేస్తుంది సమంత. దీన్నే నిరూపిస్తూ కొద్ది రోజుల క్రితం ప్రసారం అయిన బిగ్ బాస్ దసరా స్పెషల్ ఎపిసోడ్‌లో గెస్ట్ హోస్టుగా సందడి చేసిందామె. ఇక, ఈ మధ్య తెలుగు ఓటీటీ సంస్థ ఆహా కోసం 'సామ్ జామ్' అనే షోతో రియల్ హోస్ట్ అయింది. సినీ సెలెబ్రిటీలతో చిట్ చాట్ చేసే ఈ షో సూపర్ సక్సెస్ అయింది.

ఎంటర్‌టైన్‌మెంట్ మామూలుగా ఉండదుగా

ఎంటర్‌టైన్‌మెంట్ మామూలుగా ఉండదుగా

'సామ్ జామ్' షో సమంత తనదైన శైలి హోస్టింగ్‌తో ఆకట్టుకుంటోంది. అల్లరి చేస్తూ.. నవ్వుతూ.. నవ్విస్తూ తెగ సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ షోలోకి హీరోలు మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ.. దర్శకులు నాగ్ అశ్విన్, క్రిష్ జాగర్లమూడి.. హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా ఎంట్రీ ఇచ్చారు. వీరితో పాటు సైనా దంపతులు వచ్చారు.

సామ్ జామ్ షోను అలా ముగించిన సంస్థ

సామ్ జామ్ షోను అలా ముగించిన సంస్థ


ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అయిన 'సామ్ జామ్' షో ముగిసింది. పది ఎపిసోడ్లతోనే ఈ సీజన్‌ పూర్తయినట్లు సంస్థ పేర్కొంది. ఇక, చివరి ఎపిసోడ్ కోసం అక్కినేని నాగ చైతన్యను స్పెషల్ గెస్టుగా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తన భార్య సమంత గురించి ఎన్నో రహస్యాలు లీక్ చేశాడు. అంతేకాదు, ఆమె ఇంట్లో ఎలా ఉంటుందో ఫన్నీగా వివరించాడు. దీంతో ఈ ఎపిసోడ్ ఫన్నీగా ఎండయింది.

హోస్టుగా సమంత సరికొత్త రికార్డు: ఆ షో కోసం

హోస్టుగా సమంత సరికొత్త రికార్డు: ఆ షో కోసం


సామ్ జామ్‌ షోకు సమంత తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు లీక్ అయ్యాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆమె ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 15 లక్షలు తీసుకుందట. ఇలా పది ఎపిసోడ్లకు గానూ రూ. 1.50 కోట్లు అందుకున్నట్లు తెలిసింది. బిగ్ బాస్ షో మినహా మిగిలిన కార్యక్రమాల్లో ఇంత మొత్త తీసుకున్న యాక్టర్ లేరు. కాబట్టి సామ్ పేరిట అరుదైన రికార్డ్ నమోదైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X