For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సమంత సడెన్ షాక్.. రూటు మార్చేస్తూ హాట్ హాట్‌‌గా భలే కిక్కిచ్చిందిలే!

  |
  Samantha Hot Pic Goes Viral || Akkineni Fans Furious On Samantha

  సమంత అక్కినేని.. ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్లలో కెల్లా భారీ క్రేజ్ ఉన్న ముద్దుగుమ్మ. పెళ్ళికి ముందే హీరోయిన్‌గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. నాగచైతన్యను పెళ్ళాడి అక్కినేని వారింట అడుగు పెట్టాక ఆ పాపులారిటీని అమాంతం పెంచుకుంది. పెళ్లి చేసుకున్న సినిమాలు మానేస్తుందేమో అని ఆడియన్స్ పెట్టుకున్న అనుమానాలను పటాపంచలు చేస్తూ వరుస సినిమాలకు కమిట్ అవుతోంది. అంతేకాదండోయ్! నెట్టింట కూడా అమ్మడి హవా మాములుగా లేదు.

  సెగలు పుట్టించే సమతా లుక్.. వెరీ హాట్

  సెగలు పుట్టించే సమతా లుక్.. వెరీ హాట్

  తాజాగా సమంత తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా ఓ సెన్సేషనల్ పిక్ షేర్ చేసింది. కూరకరు మతిపోగెట్టే లుక్‌తో ఒక్కసారిగా నెట్టింట వేడి పుట్టించింది. పెళ్ళైన త‌ర్వాత కూడా త‌న‌లో ఏ మార్పు రాలేద‌ని మ‌రోసారి నిరూపించింది స‌మంత. హాట్ హాట్‌ గా దర్శనమిస్తున్న ఆమె అందాలు చూసి వావ్ అనేస్తున్నారు నెటిజన్లు.

  అప్పుడలా.. ఇప్పుడిలా

  అప్పుడలా.. ఇప్పుడిలా

  నిజానికి హీరోయిన్ అన్నాక గ్లామర్ ట్రీట్ ఇవ్వడం సాధారణమే కానీ సమంత ఇప్పుడు కేవలం హీరోయిన్ మాత్రమే కాదు అక్కినేని కోడలు కూడా. అందుకే ఈమె తెగింపు చూసి షాకవుతున్నారంతా. మొన్నామధ్య భర్త నాగ‌చైత‌న్య‌తో క‌లిసి టూర్ వెళ్లిన‌పుడు ఏకంగా బికినీలో క‌నిపించిన ఈ అమ్మడు మరోసారి ఇలా అందాల విందు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

  నెటిజన్స్ స్పందన.. ట్రోల్స్

  సమంతకు ట్రోలింగ్ బారిన పడటం కొత్తేమీకాదు. గతంలో చాలాసార్లు పలు రకాల కామెంట్లు వచ్చినా లైట్ తీసుకుంది సామ్. అయినప్పటికీ సమంత తాజాగా వ్యవహారాలపై కామెంట్స్ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అక్కినేని కోడలిగా ఇలా హాట్ డ్రెస్సులేంటి? అని కొందరు ప్రశ్నిస్తుండగా.. సామ్ రియల్లీ సూపర్బ్ అని ఇంకొందరు ఆమెను ఆకాశానికెత్తుతున్నారు.

  మజిలీ, ఓ బేబీ రూపంలో వరుస హిట్స్

  మజిలీ, ఓ బేబీ రూపంలో వరుస హిట్స్

  గతేడాది వరుస విజయాలతో దూసుకుపోయిన సామ్.. ఈ ఏడాది కూడా అదే రేంజ్ కొనసాగిస్తోంది. ఇటీవలే భర్తతో కలిసి మజిలీ రూపంలో భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న ఈమె ఆ వెంటనే ఓ బేబీ సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా తాను మెప్పించగలను అని నిరూపించింది. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సమంత కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలిచింది.

  టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ

  టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ

  ఇకపోతే సమంత టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలోనూ ఎప్పుడూ ముందే ఉంటుందనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టీవ్‌గా ఉండే ఈమె ఓ వెబ్ సిరీస్ చేసేందుకు కమిట్ అయ్యిందట. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ తరుణంలో వెబ్ సిరీస్ లకు డిమాండ్ పెరగటం కారణంగా సమంత ఇటువైపుగా ఆలోచనలు చేస్తోందట.

  English summary
  After marriage Samantha Akkineni running successfully with new movies. Now she was doing workouts in gym. And also she posts her sexy looks in social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X