మరీ ఇంత సెక్సీగా ఉంటే ఎలా సామ్? పెళ్లయ్యాక కూడా ఏంటీ పని.. ఫైర్ అవుతున్న నెటిజన్స్

Recommended Video

Samantha Akkineni Gets Trolled By Netigens For Posted A Sizzling Photo!!

ఇప్పటి యంగ్ హీరోయిన్లలో అక్కినేని సమంతది డిఫెరెంట్ స్టైల్. అందరూ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి భిన్నంగా సమంత దూసుకెళ్తుండటం ఆమెలో గమనించదగ్గ విషయం. ఓ హీరోయిన్ పెళ్లి చేసుకుందంటే ఇక ఆమె పని అయిపోయినట్లే! గ్లామర్ ఒలకబోయడానికి ఆమె సూట్ కాదు. సో సినిమా అవకాశాలు కూడా రావు. ఒకవేళ వచ్చినా ఆ హీరోయిన్ చేయదు.. అనే సంప్రదాయాలకు చెక్ పెడుతూ సమంత వెళ్తున్న తీరు టాలీవుడ్ ఇండస్ట్రీని ఆశ్చర్య పరుస్తోంది.

నాగ చైతన్యతో పెళ్లి.. ఫ్యాన్స్ బెంగ

నాగ చైతన్యతో పెళ్లి.. ఫ్యాన్స్ బెంగ

అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత.. ఇక సినిమాలకు దూరమవుతుందేమోనని ఆమె ఫ్యాన్స్ బెంగ పెట్టుకున్నారు. కానీ ఆ బెంగను ఆదిలోనే తుడిచేసింది సామ్. పెళ్లి కాగానే ఓ నెల గ్యాప్ తీసుకొని వెంటనే సెట్స్ పై వాలింది. ఇక అప్పటి నుంచి వెనుతిరిగి చూస్తే ఒట్టు. వరుసపెట్టి సినిమాలు చేస్తూ వస్తోంది.

యంగ్ స్టార్స్‌తో రొమన్స్.. భర్తతో షికార్లు

యంగ్ స్టార్స్‌తో రొమన్స్.. భర్తతో షికార్లు

వరుసపెట్టి సినిమాలు చేస్తూ వస్తున్న సమంత.. పెళ్లి తర్వాత సిల్వర్ స్క్రీన్ పై యంగ్ స్టార్స్‌తో రొమన్స్ చేసేందుకు ఏ మాత్రం వెనకాడలేదు. ఇక షూటింగ్ గ్యాపుల్లో భర్త నాగచైతన్యతో కలిసి విదేశాల్లో షికార్లు కొడుతూ తెగ హంగామా చేస్తోంది సమంత. అంతేకాదు అక్కినేని కోడలిగా, నాగచైతన్యకు సరైన జోడీగా సమంత సూపర్ హిట్ అయింది.

ఏమాత్రం తగ్గడం లేదు

ఏమాత్రం తగ్గడం లేదు

పెళ్లి అయ్యాక కూడా సమంత హాట్ లుక్స్ ఇవ్వడంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఆ మధ్య భర్త నాగచైతన్యతో కలిసి హాట్ హాట్ పోజులిచ్చిన సామ్.. తాజాగా సోలో ఫోజుతో మాయ చేసింది. ఎవ్వరేమనుకున్నా గ్లామర్ ఇండస్ట్రీలో ఇది కామనే అన్నట్లుగా హాట్ ఫోటో షూట్లను కంటిన్యూ చేస్తోంది సమంత.

హాఫ్ పేస్.. బాడీ ఫుల్

తాజాగా ఆమె పోస్ట్ చేరిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డెనిమ్ జీన్స్, ప్రింటెడ్ కలర్స్ తో ఉన్న టాప్ ధరించిన సమంత షర్టుకు బటన్లు లేకుండా కింద ముడి వేసి మోడ్రెన్ లుక్ లో దర్శనమిచ్చింది సామ్. ఇందులో సమంత ఫేస్ సగమే కనిపిస్తుండగా.. బాడీ ఫుల్ గా కనిపిస్తోంది. ఈ లుక్ పై కామెంట్లు హోరెత్తుతున్నాయి.

నెటిజన్స్ ట్రోలింగ్

నెటిజన్స్ ట్రోలింగ్

సమంత షేర్ చేసిన ఈ హాట్ పిక్ చూసి నెటిజన్లు ఆమెను తెగ ట్రోల్ చేసేస్తున్నారు. ఏంటి? సామ్ నీకు పెళ్లైందనే విషయాన్ని మర్చిపోయావా?, గొప్పింటి కోడలిగా ఉన్న నీవు ఇలా ఎక్స్‌పోజ్ చేయడమేంటి సామ్? అంటూ రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే సమంత మాత్రం అవేవీ పట్టించుకోక పోవడం విశేషం.

సమంత సినిమాలు

సమంత సినిమాలు

మిస్ గ్రానీ రీమేక్ ఓ బేబీ సినిమాలో లీడ్ రోల్ పోషించింది సామ్. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. మరోవైపు తన స్నేహితుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన్మధుడు 2 లో కీలక పాత్ర పోషిస్తోంది సామ్. ఈ సినిమాలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X