టెన్షన్ పడుతున్న సమంత.. ప్రేక్షకులు చూస్తే ఇక అంతే సంగతులని భావించి!
అక్కినేని సమంత.. ప్రస్తుతం టాలీవుడ్ తారల్లో స్టార్ హీరోలతో సమానమైన ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. అక్కినేని కోడలిగా పెళ్లి తర్వాత వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ వెళ్తున్న సామ్.. ఓ సినిమా విషయంలో మాత్రం తెగ టెన్షన్ పెడుతోందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకు సమంత టెన్షన్‌కి కారణమేంటి? స్టార్ హీరోయిన్ అయి ఉండి ఇలా టెన్షన్ పడాల్సిన అవసరం ఎందుకొచ్చింది? వివరాలు చూస్తే..

అక్కినేని కోడలిగా సమంత
నాగ చైతన్యతో వివాహం చేసుకున్నాక అక్కినేని కోడలిగా సినీ వారసత్వాన్ని కొనసాగిస్తోంది సామ్. పెళ్లి తర్వాత ఆమె నటించిన సినిమాలు రంగస్థలం, యూ టర్న్, మజిలీ, ఓ బేబీ సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో తెలిసిందే. దీంతో అక్కినేని కోడలిగా సమంతకు బాగా కలిసి వస్తోంది అనే టాక్ జనాల్లో వినిపిస్తోంది.

సమంతకు మొదలైన టెన్షన్
గతం లోనే స్టార్ స్టేటస్ తో దూసుకుపోయిన సమంత.. అక్కినేని కోడలు భారీ ఫాలోయింగ్ కూడగట్టుకుంది. అక్కినేని అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇస్తూ వెండితెర పై అలరిస్తోంది. సినిమాలే లోకంగా వరుస సినిమాలకు కమిట్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా తాను నటించిన ఓ సినిమా విషయంలో సమంతలో టెన్షన్ మొదలైందట.

బోల్డ్‌గా అక్కినేని సమంత
ఈ మధ్య పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తూ వస్తున్న సామ్.. గతంలో కోలీవుడ్ సూపర్ డీలక్స్ సినిమా చేసింది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ చిత్రంలో సమంత కెరీర్‌లో ఎన్నడూ చేయనటువంటి బోల్డ్ క్యారెక్టర్ చేసింది. ఈ పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కానీ ఇదే పాత్ర ఇప్పుడు తన కెరీర్‌కి కొత్త చిక్కులు తెస్తుందేమో అని సామ్ భయపడుతోందట.

డౌట్ ఫుల్‌గా సమంత
తెలుగు ప్రేక్షకులు తన బోల్డ్ క్యారెక్టర్ చూశారంటే కచ్చితంగా తన కెరీర్ పై ప్రభావం చూపుతుందని సమంత భావిస్తోందట. అందుకే ఈ చిత్ర తెలుగు విడుదలను ఈమె అడ్డుకుంటుందనే ప్రచారం మొదలైంది. సూపర్ డీలక్స్ తెలుగు డబ్బింగ్ రైట్స్ కోసం నిర్మాతలు ఆసక్తి చూపుతున్నా సమంత మాత్రం డౌట్ ఫుల్‌గా ఉందని తెలుస్తోంది. అయినప్పటికీ సామ్ మాత్రం దీనికి అడ్డుకట్ట వేస్తూ వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

సమంత ఓ బేబీ
ఇక సమంత తాజా చిత్రం ఓ బేబీ భారీ కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సమంత కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచింది. 60 ఏళ్ల ముసలావిడ లక్షణాలున్న 24 ఏళ్ల యువతిగా సామ్ చూపిన హావభావాలు ప్రేక్షకుల మనసు దోచుకున్నాయి.


Click it and Unblock the Notifications











