సిద్ధార్థ్‌ను అలా వదిలించుకొన్నా.. లేకపోతే నేను మరో సావిత్రిలా.. సమంత షాకింగ్ కామెంట్స్
అందాల తార సమంత అక్కినేని వైవాహిక జీవితంతోపాటు సినీ లైఫ్ కూడా బంగారంలా సాగిపోతున్నది. పెళ్లి తర్వాత ఫ్యామిలీ లైఫ్‌ను చక్కదిద్దుకొంటూ.. కెరీర్ పరంగా భారీ హిట్లను సొంతం చేసుకొంటున్నదీ బ్యూటీ. తాజాగా హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019 టైటిల్‌ను కూడా సాధించింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మాజీ ప్రియుడు సిద్ధార్థ్‌తో విడిపోవడం వెనుక సీక్రెట్‌ను సమంత వెల్లడించడం సెన్సేషన్‌గా మారింది. సమంత చెప్పిన విషయం ఏమిటంటే..

సిద్ధార్థ్‌తో పీకల్లోతు అఫైర్
ఏం మాయ చేశావే సినిమాలో నటించిన తర్వాత చైతూ, సమంత స్నేహితులయ్యారు. ఆ తర్వాత హీరో సిద్ధార్థ్‌తో సమంత చాలా సంవత్సరాలు డేటింగ్ చేసింది. వీరి ప్రేమాయణం పెళ్లి పీటల వరకు వచ్చింది. శ్రీశైలంలో వారిద్దరు కలిసి పూజ కూడా జరిపించారు. ఇంత జరిగిన వారి రిలేషన్‌కు అనూహ్యంగా బ్రేక్ పడింది.

నాగచైతన్యతో వివాహం
ఆ తర్వాత నాగచైతన్య అక్కినేనితో ప్రేమ పెళ్లి పీటల వరకు వచ్చింది. అక్టోబర్ 2017లో ఘనంగా సమంత, చైతూ పెళ్లి చేసుకొన్నారు. గోవాలో క్రైస్తవ, హిందూ సంప్రదాయల ప్రకారం ఈ వివాహం జరిగింది. అప్పటి నుంచి వారిద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారనే విషయం తెలిసిందే.

సావిత్రి జీవితం మాదిరిగానే
ఇలాంటి పరిస్థితుల్లో సమంత తన మాజీ ప్రియుడితో ప్రేమ, బ్రేకప్ గురించి ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో ప్రస్తావించడం ఆసక్తి రేపింది. సావిత్రి జీవితంలో చోటుచేసుకొన్న కొన్ని సంక్షోభాలు నా జీవితంలో కూడా చోటుచేసుకొన్నాయి. కానీ ఆదిలో వాటిని గ్రహించి పరిస్థితిని చక్కదిద్దుకొన్నాను. కాబట్టే నాకు అలాంటి విషాదకరమైన జీవితానికి దూరంగా ఉన్నాను అని సమంత అన్నారు.

సిద్దార్థ్ మాయ నుంచి త్వరగా బయటపడ్డా
సిద్ధార్థ్‌తో వ్యవహారాన్ని సాధ్యమైన తొందరగా తెంచుకొన్నాను. ఆ రిలేషన్ నుంచి ఫాస్ట్‌గా బయటపడ్డాను. కాబట్టే నా జీవితంలో పెద్ద ముప్పు తప్పించుకొన్నాను. నాకు నాగచైతన్య లాంటి వ్యక్తి దొరకడం అదృష్టం. చైతూ నాకు భగవంతుడు ఇచ్చిన కానుక అని భావిస్తాను. చైతూ లాంటి మరో వ్యక్తిని చూడలేం అని సమంత చెప్పారు.
Recommended Video

సమంత కెరీర్ గురించి
వరుస హిట్లతో దూసుకెళ్తున్న సమంత అక్కినేనికి జాను సినిమా కొంత నిరాశను కలిగించింది. తమిళ చిత్రం 83 మూవీ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సినీ విమర్శకుల ప్రశంసలు దక్కినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద కాసుల పంటను పండించలేకపోయింది. ప్రస్తుతం అశ్విని శరవణన్ తెరకెక్కిస్తున్న కాథువాకుల రెండు కాథల్ అనే ద్విభాష చిత్రంలో నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











