సమంత సంచలన నిర్ణయం.. సినిమాలకు దూరం అవుతుందన్న వార్తలకు ఇలా క్లారిటీ.!

By Manoj

'ఏ మాయ చేశావే' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది సమంత. మొదటి మూవీతోనే ఎంతో గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమెకు ఆఫర్లు వచ్చాయి. ఇక, వివాహం తర్వాత సమంత సినీ కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఈ క్రమంలోనే ఆమె వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అక్కినేని వారి కోడలు సినిమాలకు దూరం అవబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సమంత ఓ సంచలన నిర్ణయం తీసుకుందంటూ తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా వార్త..? పూర్తి వివరాల్లోకి వెళితే...

 ఒకటి కాదు.. రెండు కాదు అన్నీ

ఒకటి కాదు.. రెండు కాదు అన్నీ

సమంత ఈ మధ్య వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంది. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం'లో అద్భుతమైన నటన కనబరిచిన ఆమె.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వరుసగా ‘మహానటి', ‘యూటర్న్' వంటి హిట్ చిత్రాల్లో నటించింది. ఇక, ఈ మధ్య ‘ఓ బేబీ' సినిమా ద్వారా మరో హిట్ కొట్టింది.

 సినిమా అయిపోయింది.. అది మిగిలింది

సినిమా అయిపోయింది.. అది మిగిలింది

‘ఓ బేబీ' తర్వాత సమంత కేవలం ఒకే ఒక్క సినిమాలో నటించింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96'కు తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ మూవీలో శర్వానంద్ సరసన చేసింది. దిల్ రాజు బ్యానర్‌లో వస్తున్న ఈ మూవీ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. దీని తర్వాత సమంత ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌ ద్వారా డిజిటల్ రంగంలోకి ఎంటర్ అయింది.

 నాగ చైతన్యతో మరోసారి పెళ్లి

నాగ చైతన్యతో మరోసారి పెళ్లి

అక్కినేని సమంత త్వరలోనే మరో తెలుగు సినిమాలో నటించబోతుందని ప్రచారం జరుగుతోంది. ‘గీత గోవిందం' దర్శకుడు పరశురాం - అక్కినేని నాగ చైతన్య కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో ఆమె నటిస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో చైతూ.. సామ్ మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ మాత్రం రావడం లేదు.

సమంత తల్లి కావాలనుకుంటోంది

సమంత తల్లి కావాలనుకుంటోంది

కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్న అంశాల్లో సమంత తల్లి కాబోతున్న వార్త కూడా ఉంది. ఆమె గర్భం దాల్చాలని డిసైడ్ అయిందని, అందుకే సినిమాలను ఒప్పుకోవడం లేదని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మధ్య సామ్ ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేయడంతో ఈ వార్తలకు బలం చేకూరింది.

సమంత సంచలన నిర్ణయం

సమంత సంచలన నిర్ణయం

‘మాయ', ‘గేమ్ ఓవర్' వంటి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించిన అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో సమంత సినిమా చేయబోతుందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో సమంత దెయ్యంలా కనిపించబోతుందని కూడా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, తనను రేప్ చేసిన కొందరు వ్యక్తులను దెయ్యమై వచ్చి చంపేస్తుందనే టాక్ వినిపిస్తోంది.

ఈ తరహా పాత్ర చేసింది.. ఇలా చేయలేదు

ఈ తరహా పాత్ర చేసింది.. ఇలా చేయలేదు

గతంలో వచ్చిన ‘రాజుగారి గది 2' సినిమాలో సమంత ఆత్మగా కనిపించింది. ఇది కూడా ఎంతో డీసెంట్‌గా కనిపించింది. కానీ, అశ్విన్ సినిమాలో మాత్రం సామ్ ఎంతో క్రూరంగా నటిస్తోందని అంటున్నారు. గ్లామరస్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న సమంత.. ఈ తరహా పాత్ర చేయాలనుకోవడం నిజంగా సాహసమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X