twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ గాయం గుర్తు చేసుకుంటేనే..! అనుమానాలకు తావిస్తోన్న సమంత పోస్ట్

    |

    టాలీవుడ్‌ ఇండస్ట్రీలో సూపర్ జోష్‌లో ఫుసుకుపోతోంది సమంత అక్కినేని. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా ఆమె వెండితెర ప్రయాణం సాఫీగా సాగిపోతోంది. ఇప్పటికే టాలీవుడ్ యంగ్ హీరోలందరి సరసన ఆడిపాడిన సమంత.. వరుస సినిమాలకు కమిట్ అవుతోంది. అయితే తాజాగా తన సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా సమంత చేసిన ఓ పోస్ట్, దాని ద్వారా వ్యక్తపరిచిన సందేశం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వివరాలు చూద్దామా..

    సోషల్ మీడియాలో యాక్టివ్.. విపరీతమైన ఫాలోయింగ్

    సోషల్ మీడియాలో యాక్టివ్.. విపరీతమైన ఫాలోయింగ్

    కేవలం సినిమాలే కాదు ఆన్‌లైన్ వేదికలపైనా సమంత చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అక్కినేని ఫ్యామిలీ సంగతులు, తన సినిమా విశేషాలు పంచుకుంటూ ఉంటుంది. అందుకే నెట్టింట ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్. సమంత పోస్ట్ పెట్టిందంటే చాలు అది వైరల్ కావాల్సిందే. అలాంటి సమంత తాజాగా ఓ పోస్ట్ పెట్టి అనుమానాలు రేకెత్తించింది.

    ఆ గాయం గుర్తు చేసుకుంటేనే..

    ఆ గాయం గుర్తు చేసుకుంటేనే..

    ''గతంలో తగిలిన తీవ్ర గాయాలను ఓ సారి గుర్తు చేసుకుంటే ఎంతో ఓదార్పు దొరుకుతుంది. అక్కడ నిన్ను నువ్వు గుర్తించగలవు. అప్పుడే నీకు అసలైన మనశ్శాంతి లభిస్తుంది'' అని పేర్కొంటూ తన ఫొటో జత చేసింది సమంత. దీంతో వెంటనే ఈ పోస్ట్ నెట్టింట సెన్సేషన్‌గా మారి చర్చనీయాంశం అయింది.

    ఏంటి.. సమంత ఇలా అంటోంది..?

    సమంత చేసిన ఈ పోస్ట్ చూసి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఏంటి.. సమంత ఇలా అంటోంది..? గతంలో సమంతకు ఏదైనా చెప్పుకోలేని కష్టం వచ్చిందా అంటి అని డౌట్‌గా ఫీల్ అవుతున్నారు. నిజంగానే సమంతను ఏదో తెలియని గాయం వెంటాడుతోందని, అందుకే ఇలాంటి సందేశం ఇచ్చిందని మాట్లాడుకుంటున్నారు.

    క్లారిటీ లేదు కానీ సమంత జోష్

    క్లారిటీ లేదు కానీ సమంత జోష్

    ఇకపోతే గతంలో సమంతకు తగిలిన గాయం ఏంటి? ఆమె పెట్టిన ఈ పోస్ట్ జనంలో మేల్కొలుపు తీసుకు రావడానికా? లేక తనకు తగిలిన గాయం గురించి వ్యక్త పరచడానికా? అనేది మాత్రం క్లారిటీ లేదు. మరోవైపు సమంత జోష్ ఆగేలా లేదు. పెళ్లి తర్వాత వరుస హిట్స్ ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు ఇటీవలే ఓ బేబీ రూపంలో సూపర్ సక్సెస్ సాధించింది.

     ఇక నుంచి అక్కడ కూడా..

    ఇక నుంచి అక్కడ కూడా..

    మరికొద్ది రోజుల్లోనే 96 రీమేక్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది సమంత. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. ఇక మరోవైపు పెరుగుతున్న ఆధునికతను క్యాచ్ చేసుకునేలా సమంత ప్లాన్ చేస్తోందని, ఇందులో భాగం గానే ఓ వెబ్ సిరీస్ కూడా స్టార్ట్ చేసిందనేది తాజా సమాచారం.

    English summary
    Tollywood star heroine Samantha Akkineni social media post creating sensation in online platforms. In this post she shares her feelings.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X