మాపై చిన్నచూపు ఎందుకు? హీరోలకంటే దారుణంగా.. రెమ్యునరేషన్లపై కుండబద్దలు కొట్టిన సమంత
అక్కినేని వారి కోడలు అయిన తరువాత కూడా సమంత నటిగా తన స్టార్ డమ్ ను అలానే కొనసాగిస్తోంది. సాధారణంగా పెళ్లయితే హీరోయిన్స్ చాలా వరకు సినిమాలు తగ్గించేస్తారు. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం నటనకు పెళ్లికి ఏ మాత్రం సంబంధం లేదని నిరూపిస్తున్నారు. సమంత కూడా గ్లామర్ వరల్డ్ లో ఎలాంటి మార్పులు లేకుండా తన రెగ్యులర్ లైఫ్ ను కొనసాగిస్తోంది. ఇక ఇటీవల సమంత రెమ్యునరేషన్స్ లలో ఉండే వ్యత్యాసంపై ఎవరు ఊహించని విధంగా కామేంట్స్ చేసింది.

మొదటి నుంచి కూడా..
ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సమంత మొదటి నుంచి కూడా మనసులో అనుకున్న విషయాన్ని ఓపెన్ గానే బయటకు చెబుతూ వస్తోంది. అయితే వీలైనంత వరకు కాంట్రవర్సీ కాకుండా స్పందించే సమంత చాలా సార్లు హీరోయిన్స్ కు హీరోల లెవెల్లో తగిన గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

ఆ విషయం అర్థం కావడం లేదు
గతంలో చాలా మంది ఈ విషయంపై స్పందించారు. రాధికా ఆఫ్టే కూడా తనదైన శైలిలో కౌంటర్లు వేసింది. హీరోయిన్స్ ఎంత కష్టపడినా కూడా హీరోలతో సమానంగా ఎందుకు చూడరో అర్థం కాదని వాబోయింది. ఇక ఇప్పుడు సమంత ఏకంగా పారితోషికాల్లో కూడా వ్యత్యాసాలు చూపిస్తున్నారు అంటూ వివరణ ఇచ్చింది.

కుండబద్దలు కొట్టిన సమంత
హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా హీరోయిన్స్ కూడా సినిమాకు న్యాయం చేయాలని అన్ని విధాలుగా కష్టపడుతున్నారు. కానీ రెమ్యునరేషన్ మాత్రం హీరోల కంటే హీరోయిన్స్ కు చాలా తక్కువ ఇస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద మార్కెట్ ఉన్నప్పటికీ ఎక్కువగా ఇవ్వడం లేదు. టాప్ 3 స్టార్ హీరోయిన్స్ కు 20వ స్థానంలో ఉన్న హీరో కంటే కూడా తక్కువ ఇస్తున్నట్లు సమంత కుండబద్దలు కొట్టేసింది.

ఇదొక గొప్ప అన్యాయం
అంతే కాకుండా ఇండస్ట్రీలో సినిమా సినిమాకు హీరో తన రెమ్యునరేషన్ ను ఇష్టం ఉన్నంత పెంచుకుంటూ ఉంటే హీరోయిన్స్ కు మాత్రం అలా ఉండదు. ఏ మాత్రం అనుమతించరు. ఒకవేళ కొంచెం పారితోషికాన్ని పెంచినా కూడా ఇండస్ట్రీలో అదో పెద్ద సమస్యగా మారుతుంది. స్టార్ హీరోల లాగా కష్టపడి పని చేసే హీరోయిన్స్ కు ఇదొక గొప్ప అన్యాయం అని సమంత వివరణ ఇచ్చింది.

నయనతార సినిమాతో బిజీగా..
సమంత ఓపెన్ గా చెప్పిన ఈ విషయంలో వాస్తవం ఉందని చాలా మంది పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ హెచ్చు తగ్గులకు ఎండ్ కార్డ్ వెయ్యాలనే కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం సమంత, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో 'కాతు వాకులా రేండు కదల్' అనే సినిమాలో నటిస్తోంది. నయనతార, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్న ఆ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











