ఆంటీని కాదు.. అమ్మాయినే! చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప.. సమంత స్పెషల్ ట్రీట్
నేటితరం హీరోయిన్స్ లో టాప్ మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఎవరికంటే ఠకీమని చెప్పే పేరు సమంత. నాగచైతన్యతో పెళ్లి తర్వాత అక్కినేని కోడలిగా ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. అయితే ఎంత పెరిగినా విరిగేదే లేదన్నట్లుగా సమంత తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. అందరు హీరోయిన్లకు తాను భిన్నం అని ప్రూవ్ చేస్తూ.. పెళ్లి తర్వాత మరింత జోష్ పెంచేసి ఫుల్ డోస్ అందాల ట్రీట్స్ ఇస్తోంది సామ్. ఈ మేరకు పొదుపైన దుస్తులతో తాజాగా సోషల్ మీడియాలో ఆమె పెట్టిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో యమ హల్చల్ చేస్తున్నాయి.

చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప
తాజా లుక్ లో సమంత వేసుకున్న డ్రెస్ చూస్తుంటే చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప! అనేయక తప్పదని అనిపిస్తోంది. దాదాపు 32 ఏళ్ల వయసున్న సామ్.. చిన్న గౌను వేసుకొని గ్లామర్ ఒలకబోస్తూ యమ హాట్ లుక్‌లో దర్శమిచ్చింది. ఎల్లో కలర్ గౌనులో సెక్సీ లుక్స్ తో కుర్రకారు మనసు దోచుకుంది సామ్.

ఎంతగానో ఎదురుచూసి.. చివరకు
ఈ గౌను ధరించేందుకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నానని సమంత పేర్కొంది. చిన్న గౌను వేసుకున్న సంబరంలో మూడు డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోజులిచ్చింది సామ్. ఎంతో స్లిమ్ గా కనిపిస్తున్న ఈ భామ యంగ్ హీరోయిన్లకు మరో పదేళ్లు కాంపిటేటర్ గా ఉండటం ఖాయమే అనిపిస్తోంది.

ఆంటీని కాదు.. అమ్మాయినే!
సమంత పెళ్లి కావడంతో ఆమెను కొందరు ఆంటీ అని సంబోసిస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా సమంత ప్రెగ్నెంట్ అని వార్తలు పుట్టించారు. అయితే ఇటీవలే ఈ వార్తలను తిప్పికొట్టిన సామ్.. తాజాగా తన స్లిమ్ అండ్ ట్రిమ్ లుక్‌తో అలాంటివన్నీఒత్తి పుకార్లే అని తేల్చేసింది. ఈ చిన్ని గౌనులో సమంత అందాలు చూసి తెగ ముచ్చట పడుతూ కామెంట్లు పెడుతున్నారు ఆమె అభిమానులు.

గృహిణిగా, యువతిగా, ఓల్డ్ ఏజ్ భామగా
ఇటీవలే భర్త నాగచైతన్యతో కలిసి 'మజిలి' సినిమాలో గృహిణిగా ఇరగదీసిన సామ్.. ప్రస్తుతం నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఓ బేబీ' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో 20 ఏళ్ల యువతిగా, 60 ఏళ్ల వృద్ధురాలిగా విలక్షణ పాత్ర పోషిస్తోంది సమంత. నాగశౌర్య హీరోగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications











