సమంత ఇన్‌స్టా ఆస్తి... మహేష్ బాబు, అల్లు అర్జున్ కంటే ఎక్కువే!
సినిమా స్టార్స్ అభిమానులనే తమ ఆస్తిగా పరిగణిస్తారు. ఎంత ఎక్కువ మంది అభిమానులు ఉంటే వాళ్ల స్టార్ ఇమేజ్ అంత హై రేంజిలో ఉంటుంది. తమను అభిమానించే వారు తగ్గిపోతే తమ కెరీర్ పతనం అవుతుందని భయపడుతుంటారు. అందుకే వారిని సంతృప్తి పరచడానికి తమ శక్తిమేర ప్రయత్నం చేస్తుంటారు.
అయితే ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ యుగంలో కేవలం సినిమాలు మాత్రమే కాదు.. సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులతో టచ్‌లో ఉండటం, తమ ఫోటోలు, వీడియోలు, సినిమాకు సంబంధించిన విశేషాలు షేర్ చేయడం ద్వారా వీలైనంత ఎక్కువ మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకోవడం లాంటివి చేస్తున్నారు సినీ స్టార్స్.

సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రస్తుతం ట్రెండింగులో ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌లో హీరోయిన్ సమంతను పాలోఅయ్యేవారి సంఖ్య తాజాగా 6 మిలియన్లకు చేరింది. మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్లకు ఇందులో 3 మిలియన్ల కంటే ఎక్కువ ఫాలోవర్స్ లేరు. ఈ విషయంలో సమంత వారిని మించి పోయింది.
ప్రస్తుతం సమంత తన భర్త నాగ చైతన్యతో కలిసి 'మజిలీ' చిత్రంలో నటిస్తున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిది. దీంతో పాటు ఆమె 'బేబీ' అనే మరో చిత్రంలో కూడా నటిస్తున్నారు. అయితే పెళ్లి తర్వాత సమంత సినిమాల జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











