For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ ఫోజులతో రెచ్చిపోయిన సమంత: వామ్మో అలాంటి బట్టల్లో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు దశాబ్ద కాలంగా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతూ హవాను చూపిస్తోన్న గ్లామరస్ నటి సమంత. 'ఏమాయ చేశావే' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే మరెవరికీ సాధ్యం కాని రీతిలో పాపులారిటీని సంపాదించుకుంది. అదే సమయంలో వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ కుర్రకారును హుషారెత్తిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా సమంత కొన్ని హాట్ హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం..? ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి!

  షర్ట్ బటన్స్ తీసేసి షాకిచ్చిన ధన్య బాలకృష్ణ: హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయిన సుధీర్ లవర్

   అక్కడా ఇక్కడా సమంత దూకుడు

  అక్కడా ఇక్కడా సమంత దూకుడు

  సుదీర్ఘ కాలంగా సినీ ప్రపంచంలో తన హవాను చూపిస్తూ దూసుకుపోతోంది సమంత. ఈ క్రమంలోనే కొంత కాలంగా వరుస విజయాలను అందుకుంటూ సత్తా చాటుతోంది. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ ఈ బ్యూటీ ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుంది. తద్వారా అక్కడా.. ఇక్కడా వరుస ఆఫర్లను అందుకుంటోంది. ఈ క్రమంలోనే ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు రెమ్యూనరేషన్‌ను భారీగా అందుకుంటోంది.

  ఆ కంటెస్టెంట్‌కు నాగబాబు సపోర్ట్: బిడ్డ లాంటి వాడంటూ కామెంట్.. అభిజీత్ గెలిచినట్లే తను కూడా!

  డిజిటల్ వరల్డ్‌లోకి సామ్ ఎంటర్

  డిజిటల్ వరల్డ్‌లోకి సామ్ ఎంటర్

  ఆకట్టుకునే అందం.. అద్భుతమైన టాలెంట్‌తో దక్షిణాదిలోనే స్టార్ హీరోయిన్‌గా తన హవాను చూపించిన సమంత.. ఆహా సంస్థ కోసం ‘సామ్ జామ్' షోను హోస్టు చేసి డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌ను కూడా చేసింది. తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇందులో ఆమె నెగెటివ్ పాత్రలో నటించింది.

  ఆమె పాత్రే హైలైట్... అవార్డ్ కూడా

  ఆమె పాత్రే హైలైట్... అవార్డ్ కూడా

  ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2'లో మనోజ్ భాజ్‌పేయ్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించినప్పటికీ.. సమంత పాత్రే ఎంతో హైలైట్ అయింది. ఇందులో ఆమె చేసిన రాజీ అనే రోల్‌కు ఎంతగానో పేరు వచ్చింది. తొలిసారి బోల్డుగా, నెగెటివ్ షేడ్స్‌తో చేసినప్పటికీ సమంత అద్భుతంగా నటించింది. దీంతో ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. అలాగే ఇటీవలే ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్' అవార్డు కూడా దక్కింది.

  సుమ షోలో సంచలన సంఘటన: నిజంగా తిట్టుకున్న జబర్ధస్త్ భామలు.. కెమెరాలు ఉన్నా కిందపడి మరీ!

  పాన్ ఇండియా మూవీ కూడా పూర్తి

  పాన్ ఇండియా మూవీ కూడా పూర్తి

  గత ఏడాది ‘జాను'తో పరాజయాన్ని చవి చూసిన సమంత ప్రస్తుతం గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘శాకుంతలం' అనే పాన్ ఇండియా ఫిల్మ్‌లో నటిస్తోంది. షూట్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు. ఇందులో మలయాళ నటుడు హీరోగా నటిస్తుండగా.. అల్లు అర్హ కూడా నటిస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా

  చేతి నిండా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. అక్కినేని సమంత సోషల్ మీడియాలో కూడా చాలా కాలంగా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా భారీ స్థాయిలో ఫాలోవర్లను పెంచుకుంటోంది. ఇప్పటికే అక్కినేని కోడలిని ఫాలో అయ్యే వారి సంఖ్య తెలుగులో ఏ హీరోకూ లేనంతగా ఉండడం విశేషం.

  యాంకర్ రవికి మానస్ వార్నింగ్: ఆమెతో ఎఫైర్ ఉందని అనడంతో ఫైర్.. అతడి స్థాయి అదే అంటూ షాకింగ్‌గా!

  అప్పుడప్పుడూ అందాల విందుతో

  అప్పుడప్పుడూ అందాల విందుతో

  సోషల్ మీడియాలో చాలా కాలంగా రచ్చ చేస్తోన్న సమంత.. అప్పుడప్పుడూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. తద్వారా అందాల విందు చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఇలా ఇప్పటికే ఎన్నోసార్లు గ్లామర్ పిక్స్‌ను వదిలింది. దీంతో ఈ స్టార్ హీరోయిన్‌పై అప్పుడప్పుడూ విమర్శలు కూడా వస్తున్నాయి. అయినప్పటికీ తనకు నచ్చినట్లుగా చేస్తూ ముందుకు వెళ్తోందామె.

  హాట్ హాట్ ఫొటోలతో సమంత రచ్చ

  హాట్ హాట్ ఫొటోలతో సమంత రచ్చ

  కొద్ది రోజులుగా సమంత వరుసగా ఫొటోషూట్లను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ బ్యూటీ తన ఎద, నడుము అందాలు కనిపించేలా ఘాటు ఫోజుల్లో హొయలు పోయింది. తద్వారా ఆయా పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇవన్నీ చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయాయి.

  English summary
  Samantha Akkineni Very Active in Social Media. Now She Shared Few Glamourous Photos in her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X