వేరే వ్యక్తిపై పడుకున్న సమంత: ఐలవ్‌యూ అంటూ క్యాప్షన్.. వాళ్ల దెబ్బకు పోస్ట్ డిలీట్ చేసేసిందిగా!

దాదాపు దశాబ్ధ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తోంది గ్లామరస్ హీరోయిన్ సమంత. 'ఏ మాయ చేశావే' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే ఎన్నో విజయాలను అందుకుంది. ఫలితంగా దాదాపు అందరు హీరోలతో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. వివాహం తర్వాత కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూకుడు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా తన సమంత ఓ వ్యక్తిపై పడుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, ఆ వెంటనే దాన్ని డిలీట్ చేసేసింది. ఆ వివరాలు మీకోసం!

పెళ్లికి ముందు అలా.. తర్వాత మరింతగా

పెళ్లికి ముందు అలా.. తర్వాత మరింతగా

కెరీర్ ఆరంభం నుంచి చాలా కాలం పాటు వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటింది సమంత. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత మరింత స్పీడు పెంచిన ఈ భామ.. మరిన్ని ఎక్కువ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ తన హవాను విస్తృతం చేసుకుని ఆకట్టుకుంటోంది.

వరుస విజయాలు.. ఆ మూవీతో ఆగింది

వరుస విజయాలు.. ఆ మూవీతో ఆగింది

కొన్నేళ్లుగా 'అఆ', 'జనతా గ్యారేజ్', 'యూటర్న్', 'మెర్సల్', 'రంగస్థలం', 'మహానటి', 'ఇరుంబుతురై', 'మజిలీ', 'ఓ బేబీ' ఇలా వరుస విజయాలతో దూసుకుపోతోంది అక్కినేని వారి కోడలు సమంత. అయితే, గత ఏడాది వచ్చిన 'జాను' ఆమె విజయాల పరంపరకు బ్రేక్ ఇచ్చింది. తమిళంలో సూపర్ హిట్ అయిన '96'కు రీమేక్‌గా వచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది.

 అందులోకి అడుగెట్టింది.. వచ్చే నెలలోనే

అందులోకి అడుగెట్టింది.. వచ్చే నెలలోనే

వెండితెరపై తిరుగులేని హీరోయిన్‌గా వెలుగొందుతోన్న సమంత.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ వరల్డ్‌లోకి అడుగు పెట్టింది. ఇందులో ఆమె నెగెటివ్ పాత్రలో నటిస్తోంది. ఫిబ్రవరి నుంచి ఇది స్ట్రీమ్ కాబోతుంది. మనోజ్ భాజ్‌పేయ్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషిస్తున్న దీనిని తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే తెరకెక్కించారు. ట్రైలర్ విడుదల కావాల్సి ఉంది.

పాన్ ఇండియా మూవీలో భాగమైన సామ్

పాన్ ఇండియా మూవీలో భాగమైన సామ్

'జాను' తర్వాత సమంత మరో సినిమాను ప్రకటించలేదు. కానీ, ఇటీవల గుణశేఖర్‌ రూపొందించనున్న 'శాకుంతలం' అనే పాన్ ఇండియా ప్రాజెక్టులో ఆమె నటిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులతో ఈ చిత్ర బృందం బిజీగా ఉంది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కనున్న ఈ రొమాంటిక డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ గుణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఆ వ్యక్తిపై పడుకున్న సమంత.. ఐలవ్‌యూ

ఆ వ్యక్తిపై పడుకున్న సమంత.. ఐలవ్‌యూ

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది స్టార్ హీరోయిన్ సమంత. ఈ క్రమంలోనే తాజాగా ప్రీతమ్ జుకల్కర్ అనే వ్యక్తిపై కాళ్లు పెట్టి పడుకున్న ఫొటోను తన ఇన్‌స్ట్రాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. నాలుగేళ్లుగా అతడు సామ్‌కు ఫ్యాషన్ స్టైలిష్టుగా పని చేస్తున్నాడు. ఈ బంధాన్ని గుర్తు చేస్తూ ఆ ఫొటోను షేర్ చేసిన ఆమె.. 'ఐలవ్‌యూ' అంటూ క్యాప్షన్ కూడా పెట్టుకుంది.

 వాళ్ల దెబ్బకు పోస్ట్ డిలీట్ చేసేసిన సమంత

వాళ్ల దెబ్బకు పోస్ట్ డిలీట్ చేసేసిన సమంత

సమంత షేర్ చేసిన ఈ ఫొటో తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయింది. దీంతో ఈ పోస్టుపై విమర్శలు చెలరేగాయి. దీన్ని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో కొందరు ఆమెను ట్రోల్ చేశారు. దీంతో స్టోరీగా పెట్టుకున్న పోస్టును డిలీట్ చేసేసింది సమంత. అయినప్పటికీ దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు మాత్రం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతూనే ఉండడంతో ఆమె హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X