తెలుగులో విడుదల కాబోతున్న సమంత సూపర్ హిట్ చిత్రం!
2018 సంవత్సరం సమంతకు మెమొరబుల్ ఇయర్ గా నిలిచింది. సమంత నటించిన అన్ని చిత్రాలు దాదాపుగా ఘనవిజయాన్ని నమోదు చేసుకున్నాయి. ఇటు టాలీవడ్, అటు కోలీవుడ్ లో సమంత హవా కొనసాగింది. మహానటి, అభిమన్యుడు, రంగస్థలం, సీమ రాజా లాంటి చిత్రాలన్నీ గత ఏడాదే విడుదలయ్యాయి. శివ కార్తికేయన్, సమంత జంటగా నటించిన సీమ రాజా చిత్రం తమిళ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్ళు రాబట్టింది.
సమంతకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని తెలుగులో కుడా విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఈ చిత్రంలో సమాంత పెర్ఫామెన్స్ హైలైట్ గా నిలిచింది. తాజా సమాచరం ప్రకారం ఈ చిత్రని ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురనున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఇమాన్ సంగీతం అందించిన తెలుగు ఆల్బంని విడుదల చేయనున్నారు.

ప్రముఖ తమిళ దర్శకుడు పోన్రాం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గత ఏడాది సెప్టెంబర్ 13న ఈ చిత్రం విడుదలైంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న శివ కార్తికేయన్ కెరీర్ లో మరో విజయంగా ఈ చిత్రం నిలిచింది. ఆర్.డి రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు.


Click it and Unblock the Notifications











