యువ హీరోతో మరోసారి సమంత.. క్రేజీ దర్శకుడి సినిమా!
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. కానీ సరైన విజయం మాత్రం దక్కడం లేదు. గత ఏడాది బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం, కవచం చిత్రాల్లో నటించాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సాక్ష్యం, పోలీసు పాత్రలో నటించిన సాక్ష్యం చిత్రాలు నిరాశపరిచాయి. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తేజ దర్శత్వంలో సీత అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ పోషిస్తోంది.
బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ ఆరంభం నుంచి స్టార్ హీరోయిన్లతోనే నటిస్తున్నాడు. సమంత, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, పూజ హెగ్డే లాంటి హీరోయిన్లంతా బెల్లంకొండతో రొమాన్స్ చేసినవాళ్ళే. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ తదుపరి చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించబోతున్నాడు.

ఈ చిత్రంలో బెల్లకొండ శ్రీనివాస్ కు జోడిగా సమంత అయితే బావుంటుందని దర్శకుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తన డెబ్యూ మూవీ అల్లుడు శీనులో శ్రీనివాస్, సమంత జంటగా నటించారు. మరో మారు ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివాహం తర్వాత విభిన్న చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్న సమంత ఈ బెల్లంకొండకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











