బిగ్‌బాస్ జోష్‌తో సమంత మరో షో.. గెస్టుగా మెగాస్టార్ చిరంజీవి.. షో పేరు ఏమిటంటే..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో దసరా పండగ నేపథ్యంగా ప్రసారమైన మహా ఎపిసోడ్‌కు సమంత అక్కినేని హోస్ట్‌గా వ్యహరించడమే కాకుండా విశేషంగా ప్రేక్షకులకు ఆకట్టుకొన్నారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో సామ్ జామ్ అనే షోకు సమంత హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. ఆహా ఓటీటీలో ప్రసారం కానున్న షోకు సంబంధించిన వివరాలను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, సమంత, దర్శకురాలు నందినిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షో గురించి మాట్లాడుతూ...

సమంతతో సామ్ జామ్
సమంత అక్కినేని హోస్ట్‌గా సామ్ జామ్ అనే కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. సెలబ్రిటీ టాక్‌తోపాటు సామాజిక సమస్యలు, చాలా అంశాలు కలిపి సామ్ జామ్‌ను రూపొందించాం. ఈ షోకు ముంబైకి చెందిన సవిలాతో కూడిన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. కాఫీ విత్ కరణ్, నాచ్ బలియే లాంటి షోలకు పనిచేసిన వారంతా సామ్ జామ్‌తో భాగస్వామ్యం అయ్యారు.

విజయ్ దేవరకొండ నుంచి మెగాస్టార్ వరకు
సామ్ జామ్ కార్యక్రమంలో అతిథులుగా టాప్ సెలబ్రిటీలు పాల్గొంటారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, తమన్నా, రష్మిక మందన్న, సైనా నెహ్వాల్, కశ్యప్ పారుపల్లి లాంటి ప్రముఖులు పాల్గొంటారు. ఈ షోను నవంబర్ 13న విజయ్ దేవరకొండతో ప్రారంభిస్తున్నాం అని నందిని రెడ్డి తెలిపారు. ఇంకా చాలా మంది ప్రముఖులు ఇందులో పాల్గొంటారు. వారెవరూ అనేది సర్‌ప్రైజ్‌గా ఉంచబోతున్నాం అని అల్లు అరవింద్ చెప్పారు.

సామ్ జామ్ నాకు ప్రత్యేకం
సామ్ జామ్ షో గురించి సమంత మాట్లాడుతూ.. లాక్‌డౌన్ తర్వాత ఇలాంటి షోతో రావడం ఆనందంగా ఉంది. ఈ షో నాకు చాలా పెద్ద ఛాలెంజ్. నా కెరీర్‌లో ఇది ప్రత్యేకం. ఈ షో ద్వారా చాలా హ్యాపీగా ఉన్నాను. లాక్‌డౌన్ సందర్బంగా మన చుట్టు వారి గురించి ఆలోచన మొదలైంది. ఎంతో మంది ఆరోగ్యంతో బాధపడ్డారు. వారికి చేరువ కావడానికి దోహద పడింది అని అన్నారు.

పెంపుడు కుక్కతో లకిసి ప్రోమోను రిలీజ్ చేసిన సమంత
సామ్ జామ్ షోకు సంబంధించిన ప్రోమోను తన పెంపుడు కుక్క హాష్‌తో కలిసి సమంత రిలీజ్ చేశారు. లాక్‌డౌన్ కావడం వల్ల గెస్టులు ఎవరూ ముందుకు రాలేదు. అందుకే మేమే ప్రోమోను ఆవిష్కరించారు. నందినిరెడ్డి ఈ ప్రోమోలకు దర్శకత్వం వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో మీడియా అడిగిన ప్రశ్నలకు సమంత ఓపికగా సమాధానం చెప్పారు.


Click it and Unblock the Notifications











