సమంత చేతిలో వాటిని చూస్తే తట్టుకోగలరా.? భయపెడుతున్న క్రేజీ అప్‌డేట్

By Manoj

ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతంగా నటించగలిగే నైపుణ్యం ఉన్న నటీమణుల్లో స్టార్ హీరోయిన్ సమంత ఒకరు. 'ఏమాయ చేశావే' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఆమె.. తక్కువ వ్యవధిలోనే తనలోని టాలెంట్ చూపించి స్టార్ హీరోయిన్ అయిపోయింది. అదే సమయంలో రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలో అందుకుని రికార్డులకెక్కింది. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపిన ఆ అమ్మడు.. ఇప్పుడు మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సమంత గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం.!

సత్తా చాటుతోంది... రెండు చోట్లా హవా చూపిస్తోంది

సత్తా చాటుతోంది... రెండు చోట్లా హవా చూపిస్తోంది


కొన్నేళ్లుగా సమంత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఒకప్పుడు గ్లామర్ రోల్స్‌నే చేసిన ఆమె.. ఈ మధ్య తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటిని మాత్రమే ఒప్పుకుంటోంది. సినిమాలు చేయడమే కాదు.. తనలోని అద్భుతమైన నటిని కూడా అందరికీ పరిచయం చేస్తూ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. ఈ క్రమంలోనే తెలుగు, తమిళంలో తన హవా చూపిస్తోంది.

ప్రయోగం విఫలమైంది.. వరుస విజయాలకు బ్రేక్

ప్రయోగం విఫలమైంది.. వరుస విజయాలకు బ్రేక్

వివాహం తర్వాత సమంత తనలోని సరికొత్త యాంగిల్ చూపిస్తోంది. అంతకుముందు వరకు కమర్షియల్ సినిమాల్లో నటించినప్పటికీ... వాటితో ప్రయోజనం పొందలేకపోయింది. ఆ తర్వాత ‘అఆ' నుంచి ఆమె స్టైల్ మార్చింది. దీంతో వరుసగా విజయాలు సమంత సొంతం అయ్యాయి. ఈ క్రమంలోనే తమిళ చిత్రం ‘96'కు రీమేక్‌గా చేసిన ‘జాను'తో ఆమె హిట్ల పరంపరకు బ్రేక్ పడింది.

సమంత తల్లి కాబోతుంది.. అందుకే ఇలా డిసైడ్

సమంత తల్లి కాబోతుంది.. అందుకే ఇలా డిసైడ్

ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపింది అక్కినేని వారి కోడలు సమంత. ఏడాది కనీసం రెండు సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంది. అయితే, ప్రస్తుతం ఆమె నటించే సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. దీంతో సమంత తల్లి కాబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ఆమె ఖండించినప్పటికీ.. ఆ వార్తలకు పుల్‌స్టాప్ మాత్రం పడట్లేదు.

భర్తతో కలిసి సమంత ప్లాన్.. త్వరలోనే ప్రకటన

భర్తతో కలిసి సమంత ప్లాన్.. త్వరలోనే ప్రకటన

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతున్న సమంత.. ఇప్పుడు సినిమాలకు దూరం కాబోతుందా అన్న అనుమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తన భర్త అక్కినేని నాగ చైతన్యతో కలిసి ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించబోతుందని ఇటీవల ఓ న్యూస్ లీకైంది. అంతేకాదు, సోనీ పిక్చర్స్‌తో కలిసి రాజ్ తరుణ్ హీరోగా సినిమా కూడా చేయనున్నారని టాక్.

ప్రస్తుతం సమంతకు మిగిలింది అదొక్కటే మరి

ప్రస్తుతం సమంతకు మిగిలింది అదొక్కటే మరి

సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. అక్కినేని సమంత ప్రస్తుతం ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్ చేస్తోంది. దీని ద్వారా డిజిటల్ మీడియా రంగంలోకి అడుగు పెడుతోంది. స్పై థ్రిల్లర్‌గా వస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సిరీస్‌ను తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే తెరకెక్కిస్తున్నారు. ఇది ‘ద ఫ్యామిలీ మ్యాన్'కు సీక్వెల్‌గా వస్తోంది.

Recommended Video

Sri Reddy Post On Rana And Miheeka Bajaj Relation, Different Angle Of Sri Reddy
సమంత చేతిలో వాటిని చూస్తే తట్టుకోగలరా.?

సమంత చేతిలో వాటిని చూస్తే తట్టుకోగలరా.?


ఈ వెబ్ సిరీస్‌లో సమంత నెగెటివ్ రోల్ చేస్తుందని, అది కూడా టెర్రరిస్ట్ పాత్ర అని ఆ మధ్య ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా దీని గురించి ఓ న్యూస్ లీక్ అయింది. దాని ప్రకారం.. ఇందులో సామ్... చేతిలో వెపన్స్ పట్టుకుని కనిపిస్తుందట. గన్స్, గ్రానైట్స్ ఇలా ఎన్నో రకాల ఆయుధాలతో ఆమె ఇప్పటి వరకూ చేయని స్టంట్స్ చేయబోతుందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X