సైమా చేసిన పనికి సమంత బుక్.. అయోమయంలో ఫ్యాన్స్.. మాములుగా ఆడుకోవట్లేదుగా.!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ సెలెబ్రిటీలపై ట్రోల్స్ రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. కొందరు తమకు ఇష్ట లేని వారిపై విమర్శలు సంధిస్తుండగా.. మరికొందరు మాత్రం కాలక్షేపానికి ఏవేవో పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతూ ఉంటారు. ఇవి ఒక్కోసారి శృతి మించిపోతున్నాయి. చాలా మంది సోషల్ మీడియా ట్రోల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా.. ట్రోలింగ్స్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇక, తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి ట్రోల్ అవుతోంది. అయితే, దీనికి కారణం ఆమె కాదు మరో సీనియర్ నటి.

సోషల్ మీడియాలో సమంత
టాలీవుడ్‌లో ఎన్నో సంవత్సరాలుగా వరుస విజయాలతో దూసుకుపోతోంది అక్కినేని వారి కోడలు సమంత. ఆమె సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటోంది. దీంతో సమంత ఫాలోవర్స్ క్రమక్రమంగా పెరిగిపోతున్నారు.

సమంతకు కొత్త కాదు
సమంతకు ట్రోల్స్ కొత్తేం కాదు. గతంలో ఆమె షేర్ చేసిన ఫొటోలు, వీడియోలపై నెటిజన్లు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇక, పెళ్లైన తర్వాత ఆమెపై విమర్శలు ఎక్కువవుతూనే ఉన్నాయి. వీటిపై సమంత కూడా చాలా సార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా.. ట్రోల్స్ మాత్రం తగ్గడం లేదు. ఈ మధ్య ఆమె సోషల్ మీడియాకు కొంచెం దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

సమంత ఫొటో చూసి షాక్ అవుతున్నారు
తాజాగా సమంతకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటో చూసిన వారందరూ షాక్‌కు గురవుతున్నారు. ఇందులో సమంత మగాడిలా కనిపిస్తుందంటూ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు, సమంతను సమంత్ అని సంభోదిస్తున్నారు. సామాన్యులు కూడా ఈ ఫొటో చూసి అవాక్కవుతున్నారు. దీంతో ఈ పిక్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

ఫొటో వెనుక రహస్యం ఇదే
ఈ ఫొటోలో సమంత లానే కనిపిస్తున్నా అది ఆమె కాదు. ఈ ఫొటోలో కనిపిస్తున్న నటి పేరు రాజశ్రీ పొన్నప్ప. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ఈమె.. నాలుగు చిత్రాల్లో నటించింది. తాజాగా ఖతార్‌లో జరుగుతున్న సైమా అవార్డుల ఫంక్షన్‌కు వెళ్లింది. అక్కడ దిగిన ఫొటోను సైమా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఆమె సమంతలా కనిపిస్తుండడంతో అందరూ అవాక్కవుతున్నారు.

సమంత ఏం చేయబోతుంది..?
‘ఓ బేబీ' సినిమాతో మంచి ఉత్సాహంతో ఉంది సమంత అక్కినేని. నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ సినిమా తర్వాత ఆమె మరోసారి నందినీతో వర్క్ చేస్తుందని ప్రచారం జరిగింది. ఇక, కొద్దిరోజులుగా వెబ్ సిరీస్‌లో నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో సమంత అభిమానులు అయోమయానికి గురవుతున్నారు.


Click it and Unblock the Notifications











