రోమాలు నిక్కబోడుచుకొన్నాయి.. తలైవి ట్రైలర్, కంగన రనౌత్‌పై సమంత ప్రశంసల వర్షం

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ నటించిన తలైవి చిత్రం ట్రైలర్ అందర్నీ ఆకట్టుకొంటున్నది. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బలమైన, భావోద్వేగమైన సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతున్నాయి. ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకొంటున్న తలైవి మూవీ ట్రైలర్‌ గురించి సమంత అక్కినేని ట్వీట్ చేసి కంగనకు అభినందనలు తెలిపారు.

తలైవి ట్రైలర్ అద్భుతంగా ఉంది. కంగన రనౌత్.. నీవు చాలా ధైర్యవంతురాలివి. సాహసమే కాకుండా మా జనరేషన్‌లో అద్భుతమైన ప్రతిభ ఉన్న నటివి అంటూ సమంత అక్కినేని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Samantha Akkineni tweets about Thalaivi and Kangana Ranaut

దర్శకుడు ఏఎల్ విజయ్‌ను ఉద్దేశించి సమంత ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేశారు. మీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నా రోమాలు నిక్కబొడిచేలా కంటెంట్ ఉంది. మీ సినిమాను ఎప్పుడెప్పుడూ థియేటర్లో చూడాలనే కుతుహలం పెరుగుతున్నది అని సమంత ట్వీట్ చేశారు.

విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మిస్తున్న తలైవి చిత్రంలో కంగన రనౌత్, అరవింద్ స్వామి, నాజర్, భాగ్యశ్రీ, సముద్రఖని, మధుబాల, జిషుసేన్ గుప్తా, పూర్ణ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 23వ తేదీన రిలీజ్ కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X