వెంకటేష్ కూతుర్ని ఓడించిన సమంత.. జడ్జీగా రానా.. చీర్ లీడర్‌గా చైతూ.. పోటీ ఏమిటంటే!
విక్టరీ వెంకటేష్ కూతురు అశ్రిత వివాహం పారిశ్రామిక వేత్త వినాయక్ రెడ్డితో జైపూర్‌లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లిలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, టాలీవుడ్ తారలు సమంత, నాగచైతన్య, సుమంత్, ఉపాసన కొణిదెల లాంటి ప్రముఖులు ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఈ వివాహ వేడుకలో భాగంగా కుటుంబ సభ్యుల హంగామా అందర్నీ ఆకట్టుకొన్నది. ఈ వేడుకలో సమంత, పెళ్లికూతురు అశ్రిత మధ్య జరిగిన ఓ పోటీకి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అదేంటో మీరే చూడండి..

చీర్ లీడర్‌గా నాగచైతన్య
సమంత, అశ్రిత మధ్య ఆర్మ్ రెజ్లింగ్ పోటీ జరిగింది. టేబుల్ చుట్టూ కూర్చొని వారిద్దరి ఎంకరేజ్ చేస్తూ పోటీని సందడిగా మార్చారు. రానా న్యాయమూర్తిగా మారిపోయాడు. సమంతకు చైతన్య చీర్ లీడర్‌గా మారి ఆమెకు ఉత్సాహాన్ని ఇచ్చారు. దాంతో సమంత తన ఉత్సాహాన్ని రెండింతలు చేసుకొని పోటీకి సిద్ధమయ్యారు.
ఫ్యామిలీ సభ్యుల ప్రోత్సాహంతో
రానా, చైతన్య ఇతర కుటుంబ సభ్యుల సాక్షిగా జరిగిన ఈ సరదా పోటీలో సమంత, అశ్రిత ప్రొఫెషనల్స్ మాదిరగా తలపడ్డారు. ఈ పోటీలో సమంత తన బలాన్నంత ప్రయోగించి ఈ పోటీలో విజయం సాధించారు. విజయం సాధించిన అనంతరం సమంత ఆనందంతో చైతూ వద్దకు వెళ్లిపోయింది.

మార్చి 28న రిసెప్షన్ ఏర్పాటు
అశ్రిత, వినాయక్ రెడ్డి పెళ్లికి సంబంధించిన విందును గచ్చిబౌలి స్టేడియంలో మార్చి 28న అన్వయా కన్వన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్నారు. ఈ విందుకు టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ, పారిశ్రామిక వర్గాలను ఆహ్వానించినట్టు తెలిసింది. ఈ విందు కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

మజిలీ చిత్రంలో నాగ చైతన్యతో కలిసి
ఇక సమంత విషయానికి వస్తే.. అక్కినేని నాగచైతన్యతో కలిసి మజిలీ చిత్రంలో నటిస్తున్నది. రొమాంటిక్ ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. అంతేకాకుండా దర్శకురాలు నందినీరెడ్డి తెరకెక్కించే ఓ బేబీ చిత్రంలో నటించింది. ఈ సినిమా కొరియన్ చిత్రం మిస్ గ్రానీ ఆధారంగా తెరకెక్కుతున్నది.


Click it and Unblock the Notifications











