సెట్స్ లో సమంత... యాడ్ షూట్ లో బిజీగా భామ
లాక్ డౌన్ లో ఇంటిపట్టునే ఉన్నా, తనదైన శైలి బిజీ బిజీగానే గడిపేసింది మన ప్రెట్టీ బ్యూటీ సమంత. ఓవైపు ఇంటిపనులు చక్కెబెట్టేస్తూ, కొత్త వంటకాలు ట్రై చేస్తూనే, తోట పనులతోనూ తనకు తానే సాటి అనిపించుకుంది. ఇక, రానా పెళ్లి ముచ్చట పూర్తవుతూనే, తన సొంత వస్త్ర దుకాణానికి కూడా పునాది వేసేసి... శేభాష్ అనిపించుకుంది.
ఇటీవలే సోషల్ మీడియా ద్వారా తన సొంత క్లాతింగ్ బ్రాండ్ అనౌన్స్ చేసిన సమంత, ఇదే తన పుత్రరత్నమంటూ తెగ సంబరపడిపోయింది. ఇక చకచకా ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేసేందుకు శ్రీకారం చుట్టిన సామ్, ఓ మాంచి యాడ్ ద్వారా జనాల్లోకి వెళ్లాలని ఫిక్స్ అయిందట.

ఈరోజే ఈ యాడ్ షూట్ కోసం సమంత షూటింగ్ లోనూ పాలుపంచుకుంటోంది. సారిధీ స్టూడియోస్ లో జరుగుతున్న షూటింగ్ కోసం సామ్, వైరస్ బారిన పడకుండా పలు రక్షణా చర్యల నడుమ సారధీ స్టూడియోస్ కు చేరుకుందట. ఇక చాలా రోజుల తరువాత కెమెరా ముందు వచ్చిన బ్యూటీ, చాలా ఎగ్జైటెడ్ గా ఉందని తెలుస్తోంది. త్వరలోనే ఈ యాడ్ జనాల ముందుకు రాబోతోంది.
ప్రస్తుతం అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ హారర్ సినిమాతో పాటూ, తమిళ రొమాంటిక్ కామెడీ కాతు వాకుల రెండు కాదల్ సినిమాల్లో భాగమైన సమంత, వ్యాపారం వైపు కూడా వడివడిగా అడుగులు వేస్తూ... రెండు పడవలపై ప్రయాణాన్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందు సాగాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











