రిలేషన్‌‌షిప్‌పై సమంత వ్యాఖ్యలు... శోభిత ధూళిపాళ కౌంటర్‌!

మా ఇంటి బంగారం మూవీ సక్సెస్ మీట్‌లో రిలేషన్‌షిప్‌పై అగ్రనటి సమంత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. భాగస్వామిని ఎంచుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెబుతూ యువతకు పలు సూచనలు ఇచ్చారు సామ్. దాంతో అక్కినేని నాగచైతన్య, శోభితలకు సంబంధించిన పాత వీడియోలు, వారు చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు బయటకు తీస్తున్నారు. ఈ క్రమంలోనే శోభిత గతంలో చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు సమంత చెప్పిన మాటలు పోల్చి చూస్తున్నారు అభిమానులు. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
రిలేషన్‌షిప్‌లో ఆ తప్పులు చేయొద్దు... సమంత షాకింగ్ కామెంట్స్
రిలేషన్‌షిప్‌లో ఆ తప్పులు చేయొద్దు... సమంత షాకింగ్ కామెంట్స్

ఏమాయ చేశావే సినిమా షూటింగ్ సమయంలో నాగచైతన్య- సమంతల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో వీరిద్దరూ గోవాలో క్రిస్టియన్, హిందూ వివాహ సాంప్రదాయాల ప్రకారం రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్‌లో సెలబ్రిటీ కపుల్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సామ్- చైతూలు ఎక్కడికి వెళ్లినా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఎంతో అన్యోన్యంగా తమ వైవాహిక జీవితాన్ని సాగించిన ఈ జంట ఎవ్వరూ ఊహించని విధంగా విడిపోయింది.

Samantha and Sobhita Dhulipala s Relationship Remarks Go Viral Amid Social Media Buzz

తన పేరు చివరన ఉన్న అక్కినేనిని తొలగించి తొలుత విడాకులపై సమంత హింట్ ఇచ్చారు. ఆ తర్వాత నాగచైతన్యతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో డిలీట్ చేయడంతో పాటు భర్తను అన్‌ఫాలో చేయడంతో డివోర్స్‌పై క్లారిటీ వచ్చింది. అనంతరం పరస్పర అంగీకారంతో కోర్టు అనుమతితో విడాకులు తీసుకున్నారు నాగచైతన్య, సమంత. వీరిద్దరూ ఎందుకు విడిపోయారన్న దానిపై రకరకాల వాదనలు తెరపైకి వచ్చాయి.

Recommended For You
కమెడియన్ ధనరాజ్‌ నోటి దురుసు.. నాగబాబు 50 వేల జరిమానా
కమెడియన్ ధనరాజ్‌ నోటి దురుసు.. నాగబాబు 50 వేల జరిమానా

సమంతతో విడాకుల తర్వాత నటి శోభిత ధూళిపాళతో ప్రేమలో పడిన చైతూ పెద్దల అంగీకారంతో 2024 డిసెంబర్ 4న ఆమెను పెళ్లాడారు. ప్రస్తుతం ఈ జంట అన్యోన్యంగా జీవిస్తూ టాలీవుడ్‌లోని స్టార్ కపుల్స్‌లో ఒకరిగా దూసుకెళ్తోంది. సమంత కూడా దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడి గతేడాది డిసెంబర్ 1న కోయంబత్తూరులోని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆశ్రమంలో భూత శుద్ధి వివాహం చేసుకుని నటిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. తాజాగా మా ఇంటి బంగారం మూవీతో పెళ్లి తర్వాత విజయాన్ని అందుకుని మంచి జోష్‌లో ఉన్నారు.

You May Also Like
Peddi Day 21 Collections: పెద్దికి మా ఇంటి బంగారం దెబ్బ.. రామ్ చరణ్ మూవీ లాభాల్లోకి రావాలంటే?
Peddi Day 21 Collections: పెద్దికి మా ఇంటి బంగారం దెబ్బ.. రామ్ చరణ్ మూవీ లాభాల్లోకి రావాలంటే?

ఇప్పుడు తాజాగా మా ఇంటి బంగారం సక్సెస్‌ మీట్‌లో సమంతను రిలేషన్‌షిప్ గురించి యువతకు ఏదైనా చెప్పమని విలేకరులు అడగ్గా.. ఆమె తనదైన శైలిలో స్పందించారు. మనిషి జీవితంలో రిలేషన్‌షిప్‌ అనేది చాలా క్లిష్టమైన సబ్జెక్ట్. ఈ బంధంలో జరిగేవి మన కంట్రోల్‌లో ఉండవు.. రిలేషన్‌షిప్ ఇద్దరు వ్యక్తులపైనే ఆధారపడి సాగుతుంది. అమ్మాయిలకు నేను చెప్పేది ఒకటే.. ముందు తన మీద తనకు పూర్తి నమ్మకం ఉండాలి. అప్పుడే పార్ట్‌నర్‌గా సరైన వ్యక్తిని ఎంచుకోగలుగుతాం, లేదంటే తప్పులు జరుగుతాయి. ముందు మిమ్మల్ని మీరు పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చుకుని ఆ తర్వాతే ఎదుటి వ్యక్తిని అంచనా వేయాలని సమంత వ్యాఖ్యానించారు.

Transfer Trimurthulu Box Office: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు బాక్సాఫీస్ పరిస్థితేంటి? వడ్డె నవీన్ మూవీపై ఆ దెబ్బ
Transfer Trimurthulu Box Office: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు బాక్సాఫీస్ పరిస్థితేంటి? వడ్డె నవీన్ మూవీపై ఆ దెబ్బ

అయితే గతేడాది డిసెంబర్ 4న తమ మొదటి పెళ్లిరోజు సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను శోభిత పంచుకున్నారు. అందులో చైతన్యతో పరిచయం, ఆయన వ్యక్తిత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శోభిత. తాను ఎంతో ప్రేమించిన వ్యక్తి భర్తగా రావడం తన అదృష్టమన్నారు. ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చాకే మనం పరిపూర్ణం అవుతామో లేదో నాకు తెలియదు. కానీ తను లేకుండా నా జీవితం పరిపూర్ణం కాదని చైతన్యపై తన ప్రేమను చాటుకున్నారు శోభిత. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు నెట్టింట ట్రెండ్ అవుతుండగా .. సమంత, శోభితల వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X