మరో బిగ్గెస్ట్ వెబ్ సీరిస్ తో రాబోతున్న సమంత.. బాలీవుడ్ యువ హీరోతో యాక్షన్.. ఎప్పుడంటే?
నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సమంత ఇటీవల కాలంలో మరింత కొత్తగా అడుగులు వేస్తోంది. ఆమె గతంలో ఎప్పుడూ లేని విధంగా పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ కూడా చేసే అందరికి షాక్ ఇచ్చింది అనే చెప్పాలి. ఒక్క పాటతోనే దేశవ్యాప్తంగా ఆమె మరో స్థాయిలో క్రేజ్ అందుకుంది.. సినిమాకు ఆ పాట ఎంతగానో హెల్ప్ అయ్యింది. తన స్థాయిని మరింత పెంచుకునే విధంగా సమంత ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే అమెజాన్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 తో మంచి గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే. ఆ సిరీస్ లో సమంత చేసిన పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఒక నటిగా కూడా ఆమె స్థాయి మరో లెవెల్ కి వెళ్ళింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత చేయబోయే ప్రాజెక్టులు కూడా అంతకుమించి ఉండాలి అని సమంత అడుగులు వేస్తోంది.
ఇక ఇటీవల బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ పాపులర్ ఇంటర్నేషనల్ సిరీస్ సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో నఠించనున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. నటుడు అవెంజర్స్ ఫేమ్ రస్సో బ్రదర్స్‌తో జతకట్టనున్నారు అనగానే ఒక్కసారిగా న్యూస్ నేషనల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఇండియన్ వెర్షన్‌కు ది ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ దర్శకులు రాజ్ & డికె దర్శకులుగా ఉంటారని తెలుస్తోంది. ఈ అమెరికన్ సిరీస్ ద్వారా వరుణ్ తన OTT అరంగేట్రం చేయనుండగా, మేకర్స్ ఫీమేల్ లీడ్ కోసం సమంతను ఎంచుకున్నట్లు సమాచారం.

ఈ యాక్షన్-ప్యాక్డ్ సీరీస్ అమెజాన్ ప్రైమ్ సిరీస్ లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే సమంత రాజ్ & డికెతో వర్క్ చేసిన విషయం తెలిసిందే. అందుకే ఆ దర్శకులు సమంతకు మరో అవకాశం ఇచ్చారు. గూఢచారి నేపథ్యంలో సాగే ఈ సిరీస్ షూటింగ్ యుఎస్‌లో జరగనుందట. రెగ్యులర్ షూటింగ్ 2022లో ప్రారంభం కానుంది. ఇక అంతర్జాతీయ ఖ్యాతి పొందిన అనేక మంది స్టంట్ కోఆర్డినేటర్లు ఇందులో ఉంటారట. అంతేకాకుండా, వరుణ్ మరియు సామ్ యాక్షన్ సీన్స్ లో నటించేందుకు ముందుగానే వివిధ శిక్షణా సెషన్‌లలో పాల్గొనబోతున్నారు. 2023లో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సీరీస్ విడుదల కానుందని అంటున్నారు.
సమంత ఈ వెబ్ సిరీస్ తో ఎలాగైనా తన స్థాయిని మరో లెవల్ కు పెంచుకోవాలని అనుకుంటుంది. ఇప్పటికే ఆమెకు బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి. అయితే ఏమాత్రం తొందరపడకుండా తనకు సూటయ్యే పాత్రలో మాత్రమే సమంత సెలెక్ట్ చేసుకకుంటోంది. ఇక ఇటీవల ఈ సినిమా ద్వారా కూడా ఆమె క్రేజ్ మరింత పెరిగింది అని చెప్పాలి. ఒక విధంగా సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న కూడా తన కెరీర్ పై మరింత ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. సమంత గతంలో కంటే విభిన్నమైన తరహాలోనే ఎక్కువగా పాత్రలను సెలెక్ట్ చేసుకుంటోంది. మరి ఈ సరికొత్త దారులలో సమంత ఇలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











