నాగార్జున ఎమోషనల్: మరోసారి సమంత పొరపాటు.. కేర్ చేయకపోయినా మామ అంటూ..
సోషల్ మీడియాలో గత కొంతకాలంగా వైరల్ అవుతున్న వార్తలలో సమంత అక్కినేని పేర్లు ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు సమంత హఠాత్తుగా తన మెట్టినింటి పేరును కూడా పక్కనపెట్టి కేవలం ఎస్ అనే అక్షరం ఎడిట్ చేయడం జరిగింది. మరోవైపు వారి మధ్య దూరం జరిగిందనే వార్తలపై ఇంతవరకు సరైన క్లారిటీ ఇవ్వలేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా టాలీవుడ్ జంటపై పై షాకింగ్ రూమర్స్ రావడం అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో సమంత నాగార్జున పోస్ట్ చేసిన ఒక ఎమోషనల్ వీడియోకు సమంత పొరపాటు చేసినట్లు అర్థమవుతోంది. నిమిషంలోనే ఆమె తన పొరపాటు సరిదిద్దుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటికే కొంత మంది నెటిజన్లు ఆ విషయాన్ని పసిగట్టేసారు.

ప్రతి రోజు ఎదో ఒక కన్ఫ్యూజన్
గత కొన్ని రోజులుగా సమంత నాగ చైతన్య మధ్య దూరం ఎక్కువ అవుతోందని సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక వాటిపై ఇంతవరకు ఎవరు కూడా క్లియర్ గా అయితే క్లారిటీ ఇవ్వలేకపోయారు. హఠాత్తుగా సోషల్ మీడియాలో తన పేరులో మార్పులు చేయడం కూడా ఆ రూమర్స్ కు మరింత బలాన్ని చేకూర్చాయి. ప్రస్తుతం ఈ విషయంలో ప్రతిరోజు ఏదో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతూనే ఉంది.

ఆలస్యంగానే..
నాగచైతన్య అలాగే అక్కినేని కుటుంబ సభ్యులలో ఎవరూ ఇలాంటి పోస్టులు పెట్టిన కూడా సమంతకు మొదటగా స్పందించడం అలవాటు. అయితే లవ్ స్టోరీ ట్రైలర్ విడుదలైనప్పుడు ఆమె ఆలస్యంగానే స్పందించింది. ఇక నాగచైతన్య గురించి ప్రతి సారి ఏదో ఒక విషయాన్ని చెప్పుకునే సమంత ఈసారి స్పెషల్ గా ఏమి వివరణ ఇవ్వలేదు. రోజురోజుకు వీరి మధ్య వార్తలు అయితే మరింత ఎక్కువ అవుతున్నాయి.
నాగార్జున ఎమోషనల్ వీడియో
ఇక రీసెంట్ గా నాగార్జున తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఒక ఎమోషనల్ వీడియోను విడుదల చేశారు. ANR Lives On అంటూ బంగార్రాజు లుక్ తో నాగార్జున దర్శనమిచ్చారు. సెప్టెంబర్ 20 నాకు ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈరోజు నా హీరో నా స్ఫూర్తి మా నాన్నగారి పుట్టినరోజు. ఆయనకు పంచె కట్టు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా పొందూరు ఖద్దరు అంటే ఎంతో ఇష్టపడేవారు. ఇదిగో నేను వేసుకున్నది అదే ఖద్దరు.. అని అన్నారు.

ఆయన నాతో ఉన్నట్లు అనిపిస్తుంది
ఇక ఆయన నవరత్నాల హారం, నవరత్నాల ఉంగరం కూడా నేను వేసుకున్నాను. నేను వేసుకున్న వాచ్ కూడా ఆయనేదే కావడం విశేషం. ఇవన్నీ నేను వేసుకుంటే ఆయన నాతో ఉన్నట్లు అనిపిస్తుంది. ఏదో తృప్తి. అందుకే ఆయనకు ఇష్టమైన పంచె కట్టును మీ ముందుకు తీసుకు రావడమే మా ప్రయత్నం. ANR Lives On నాగార్జున వివరణ ఇచ్చారు.

మామ అనకుండా సమంత పొరపాటు..
వీడియోను పోస్ట్ చేయగానే సమంత కూడా స్పందించింది. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందని కంటతడి పెడుతున్న ఎమోషనల్ ఏమోజీతో పాటు నమస్కారం, హ్యాపీ, లవ్ సింబల్ ను ట్విట్టర్ లో మెన్షన్ చేసింది. అంతే కాకుండా ఆమె నాగార్జున పేరును మాత్రమే ట్యాగ్ చేసింది. ప్రతిసారి నాగార్జున మామ అని చెప్పే సమంత ఈసారి కేవలం నాగార్జున అని మాత్రమే ట్వీట్ చేయడంతో అభిమానులు కాస్త ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఇక వెంటనే ఆమె ట్వీట్ ను డిలీట్ చేసింది.
Recommended Video

వెంటనే మామ అంటూ సరిచేసుకున్న సమంత
ఇక ట్వీట్ ను సరి చేసుకున్న సమంత అనంతరం అదే తరహాలో పేర్కొంటూ నాగార్జున మామ అని ట్వీట్ చేసింది. ఇక నిమిషాల్లోనే అలా చేంజ్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత ఇంతకుముందు కూడా నాగార్జున ట్వీట్స్ కు రిప్లై ఇవ్వగా నాగార్జున మాత్రం వాటిని పట్టించుకోలేదు. గతంలో అయితే కోడలు పిల్ల అంటూ సరదాగా స్పందించేవారు. కానీ ప్రస్తుతం మాత్రం అలాంటి వాతావరణం కనిపించకపోవడంతో విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











