twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెమ్యునరేషన్‌లో సమంత దూకుడు.. నయనతార తరువాత టాప్ హీరోయిన్‌గా డిమాండ్!

    |

    ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా రెమ్యునరేషన్స్ అందుకోవడంలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతూ ఉండటం వలన కొంతమంది హీరోయిన్స్ సినిమా సినిమాకు వారి పారితోషికం గట్టిగానే పెంచుతున్నారు. ఇక ప్రస్తుతం ఆ విషయంలో సౌత్ ఇండస్ట్రీ లో నయనతార నెంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది. ఇక మరికొన్ని రోజులు అయితే సమంత కూడా ఆమెను డామినేట్ చేసేలా ఉంది అనిపిస్తుంది. ఇక వీరు ఏ స్థాయిలో పారితోషికం అందుకుంటున్నారు అనే వివరాల్లోకి వెళితే..

     స్టార్ హీరోయిన్ గా..

    స్టార్ హీరోయిన్ గా..

    కోలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ లో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్ లలో నయనతార ఒకరు. ఈ బ్యూటీ గత పదిహేనేళ్ళుగా సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా తన స్టార్ ఇమేజ్ ను ఒకే విధంగా కొనసాగిస్తోంది. పోటీగా ఎంతమంది బ్యూటీలు వచ్చినప్పటికీ కూడా నయనతార ఇమేజ్ పై కొంచెం కూడా ప్రభావం చూపలేదు అనే చెప్పాలి.

     నయన్.. రెమ్యునరేషన్

    నయన్.. రెమ్యునరేషన్

    ఒక సినిమాకు మంచి నటి అవసరం ఉంది అంటే చాలామంది దర్శక నిర్మాతలు నయనతారపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. ఈ బ్యూటీ ప్రమోషన్స్ లో పెద్దగా పాల్గొనక పోయినప్పటికీ కూడా ఆమె స్టార్ ఇమేజ్ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది అని చెప్పాలి. ఇక ప్రస్తుతం నయనతార ఒక్కో సినిమాకు ఐదు నుంచి ఆరు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

     సమంత కూడా..

    సమంత కూడా..

    ఇక మరో వైపు సమంత కూడా మెల్లగా తన స్టార్ ఇమేజ్ ను పెంచుకోవడమే కాకుండా రెమ్యూనరేషన్ స్థాయిని కూడా పెంచుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో సమంత కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లు అలాగే స్పెషల్ ఐటమ్ సాంగ్స్ చేసేందుకు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది.

     ఆ సినిమాలకు మూడు కోట్లు

    ఆ సినిమాలకు మూడు కోట్లు

    ప్రస్తుతం సమంత ఒక్కో సినిమాకు మూడు కోట్లకు పైగానే పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సమంత కోటిన్నరకు పైగా డిమాండ్ చేసినట్లుగా ఒక టాక్ వినిపించింది. ఇక ప్రస్తుతం ఆమె చేతిలో చాల మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. గుణశేఖర్ శాకుంతలం సినిమాతో పాటు యశోద సినిమాలకు కూడా మూడు కోట్ల రూపాయల వరకు పారితోషకం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

    Recommended Video

    Rs 3 Cr seven star Hotel set for Samantha Yashoda | Filmibeat telugu
    హిట్టయితే..

    హిట్టయితే..

    నాగచైతన్య నుంచి సమంత విడాకులు తీసుకున్న తరువాత ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇక ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలతో పాటు మరో రెండు ప్రాజెక్టులు కూడా త్వరలోనే స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ముందుగా విడుదల చేయబోయే సినిమాలు ఏమాత్రం హిట్ అయినా కూడా సమంత త్వరలోనే నయనతారకు రెమ్యునరేషన్ లో పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.

    English summary
    Samantha Becomes The Highest Paid Actress By Overtaking Nayantara,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X