నయనతార జీవితంపై సమంత స్పెషల్ ట్వీట్.. పుట్టినరోజు అదిరిపోయేలా సర్‌ప్రైజ్
టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సమంత విడాకుల అనంతరం ఊహించని విధంగా అడుగులు వేస్తోంది. నాగచైతన్యతో ఇటీవల విడిపోయిన సమంత ఎప్పటిలానే తన సినిమాలతో బిజీబిజీగా మారుతోంది. అయితే ఆమె ఎంచుకున్న పాత్రలు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయి. అంతేకాకుండా ఐటెమ్ సాంగ్స్ కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే ఆమె కెరీర్ పై ఎంతగా ఫోకస్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక రీసెంట్ గా నయనతార జీవితం పై ఒక ప్రత్యేకమైన ట్వీట్ చేయడమే కాకుండా అదిరిపోయేలా సర్‌ప్రైజ్ కూడా ఇచ్చిందట.

అందరితోనూ స్నేహంగా..
సమంత విడాకులు తీసుకున్న అనంతరం సోలో గా తన జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. మొన్నటి వరకు కొన్ని విహార యాత్రలు చేసినా ఆమె ఇప్పుడు మాత్రం వరుస సినిమాలతో బిజీ అవ్వాలని అనుకుంటుంది. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ కథలను సెలెక్ట్ చేసుకోవాలి అని ఆలోచిస్తోందట. సమంతతో ఎవరైనా సినిమా చేస్తే వారందరు కూడా చాలా ఫ్రెండ్లీగా అయిపోతారు. సమంత కూడా సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా చిత్రయూనిట్ అందరితో కలిసి మెలసి ఉంటుంది.

నయన్, సమంత సినిమా
సమంత ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ అయితే హైలెట్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె 'కాతు వాకుల రెండు కాదల్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించగా మరొక ముఖ్యమైన పాత్రలో నయనతార కూడా నటించింది. నయనతార సమంత ఇద్దరూ కూడా కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంతో తమిళ ఇండస్ట్రీలో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి.

నయన్ బర్త్ డే..
ఇక నేడు నయనతార 36 వసంతంలోకి అడుగు పెట్టడంతో ఆమెకు సెలబ్రిటీస్ అందరూ కూడా ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక సమంత కూడా సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా ప్పుట్టినరోజు విషెస్ ను అందిస్తూ ఆమె జీవితం గురించి ఒక ప్రత్యేకమైన పోస్ట్ చేసింది. "ఆమె వచ్చింది. ఆమె చూసింది. ఆమె ధైర్యం చేసింది. ఆమె కలలు కన్నది. ఆమె ప్రదర్శించింది మరియు ఆమె జయించింది.." అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Recommended Video
సమంత సర్‌ప్రైజ్
అంతేకాకుండా నయనతార పుట్టినరోజు అనగానే చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా ప్రత్యేకంగా ఆమెకు సర్‌ప్రైజ్ ఇచ్చినట్లు సమాచారం. నయనతార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ అలాగే సమంత విజయ్ సేతుపతి అందరూ కూడా ప్రత్యేకమైన కేక్ ఆర్డర్ చేయించి తెప్పించారట. ఇక చిన్న పార్టీ కూడా జరిగినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సమంతా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. ఇక విగ్నేష్ శివన్ తో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న నయనతార త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











