Samantha నాగచైతన్యతో విడాకుల రూమర్లపై క్లారిటీ.. అభిమానుల ప్రశ్నలు తట్టుకోలేక లైవ్లోనే

టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంత నాగచైతన్య విడిపోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా అనేక రకాల కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ మీడియాలో కూడా ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. విడాకుల విషయంలో ఇప్పటికే అనేక రకాల ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. ఇక ఇందులో ఏవి నిజమో తెలియక అభిమనులు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. పైగా ఇప్పటివరకు ఎవరి నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. అప్పుడప్పుడు సమంత మాత్రమే పరోక్షంగా స్పందిస్తున్నప్పటికి కూడా అందులో కూడా సరైన క్లారిటీ రావడం లేదు. ఇక ఫైనల్ గా ఒక విషయం పై అయితే సమంత కుండ బద్దలు కొట్టేసింది. అభిమానుల ప్రశ్నలను తట్టుకోలేక సమంత లైవ్ లోనే ఒక క్లారిటీ వచ్చేసింది.

 అస్సలు క్లారిటీ లేదు

అస్సలు క్లారిటీ లేదు

అక్కినేని వారి బెస్ట్ కపుల్స్ అయినటువంటి సమంత నాగ చైతన్య జోడి అంటే దాదాపు ఇండస్ట్రీలో అందరికీ ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఏ మాయ చేసావే సినిమాతో మొదలైన వీరి ప్రయాణం వెండితెరపైనే కాకుండా నిజజీవితంలో కూడా ఎంతో విజయవంతంగా కొనసాగుతూ వచ్చింది. అయితే వీరు కొన్ని మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకోబోతున్నట్లు ఇటీవల కాలంలో అనేక రకాల వార్తలు వచ్చాయి. ఇక అందులో ఎలాంటి నిజం లేదని మధ్యలో కొన్ని కథనాలు వచ్చినప్పటికీ అసలు క్లారిటీ మాత్రం రావడం లేదు.

సమంత సీరియస్

సమంత సీరియస్

ఇదివరకే సమంత మీడియాలో వస్తున్న కథనాల పై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా ఆమె కుక్కల ఫోటోలు షేర్ చేసి మీడియా పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అనవసరంగా రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారని కూడా పరోక్షంగా కామెంట్ చేసింది. దాంతో ఆ విషయంలో వర్గము కబుర్లు క్లారిటీ వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో అయితే ఇంకా సమాధానం రాలేదు.

 దూరంగానే సమంత..

దూరంగానే సమంత..

అసలు సమంత నాగ చైతన్య ఇద్దరు కూడా ఒకే ఫ్రేమ్లో కనిపించి చాలా కాలం అవుతోంది. అసలు వీరిద్దరూ పక్కపక్కనే ఉన్నారా లేక ఒకరు వేరే రాష్ట్రంలో ఇంకొకరు హైదరాబాదులో ఉన్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇక లవ్ స్టోరీ సినిమాపై కూడా పెద్దగా స్పందించింది లేదు. నాగ చైతన్య సినిమాలు విడుదలైతే ఎక్కువగా ప్రమోషన్లో పాల్గొనే సమంత ఈసారి మాత్రం ఆమె ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి సక్సెస్ మీట్ వరకు దూరంగానే ఉంది.

 సోషల్ మీడియా లైవ్ లో..

సోషల్ మీడియా లైవ్ లో..

సమంత ఇటీవల ఫ్యాషన్ బ్రాండ్ సాకి మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించింది. ఇక వారు అడిగిన అనేక రకాల ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చింది. అయితే అందులో ఒకరు ముంబై వెళ్ళిపోతున్నావా? అని అడిగారు. అందుకు సమంత కుండ బద్దలు కొట్టినట్లు ఒకటే సమాధానం చెప్పేసింది.

నేను ఎక్కడికి వెళ్లడం లేదు

నేను ఎక్కడికి వెళ్లడం లేదు

అసలు ఈ రూమర్స్ ఎలా వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. నేను హైదరాబాద్ వదిలి పెట్టి ఎలా వెళ్ళిపోతాను. ఇక్కడే ఉంటాను హైదరాబాద్ నాకు ఎన్నో ఇచ్చింది. కాబట్టి నేను మరెక్కడికో వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. ఎక్కడికి వెళ్ళను అని సమంత సమాధానమిచ్చింది. ఈ వార్తలతో పాటు అనేక రకాల రూమర్స్ కూడా వస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో కూడా తనకు అర్థం కావడం లేదని పరోక్షంగా విడాకులపై కూడా స్పందించింది.

Recommended Video

Love Story Movie Success Meet | Naga Chaitanya | Sai Pallavi
ఇంకా అదే కన్ఫ్యూజన్..

ఇంకా అదే కన్ఫ్యూజన్..

ఒక విధంగా విడాకులు రూమర్స్ అని పరోక్షంగా చెప్పినప్పటికీ కూడా అభిమానుల్లో మాత్రం ఇంకా క్లారిటీ అయితే రావడం లేదు. అంతే కాకుండా సమంత ఇటీవల అక్కినేని ఫ్యామిలీ ప్రత్యేకంగా నిర్వహించిన ఫ్యామిలీ పార్టీ లో కనిపించకపోవడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆ పార్టీలో అమీర్ ఖాన్ కూడా ఉన్నారు. సమంతా లేకపోవడంతో ఒక్కసారిగా న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసిందే. అలాగే సక్సెస్ మీట్ లో కూడా కనిపించలేదు. దీంతో అనుమానాలు మరింత పెరిగాయి. మరి ఈ విషయంలో సమంత నాగ చైతన్య ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X