విడాకుల తరువాత సమంత మరో బిగ్ మూవీ.. కెరీర్ లోనే అత్యధిక రెమ్యునరేషన్!

సినిమా ఇండస్ట్రీలో సినీ తారల మధ్య ప్రేమలు పెళ్లిళ్లు జనాలను ఎంతగానో ఆకట్టుకుంటాయి. వారు సంతోషంగా కలిసి ఉంటే ఒక విధంగా కుటుంబ సభ్యులకు కంటే కూడా అభిమానులు ఎక్కువగా సంతోషిస్తారు అనే చెప్పాలి. ఒక విధంగా సమంత నాగ చైతన్య పెళ్లి తరువాతనే వారి కలయిక లో అభిమానుల సంఖ్యను సమర్థంగా పెంచేసుకున్నారు. వారు కలిసి సినిమా చేస్తే ఆ సినిమాము బాక్సాఫీస్ వద్ద ఒపెనింగ్స్ ఏ స్థాయిలో ఉంటాయో మనం సినిమాతోనే క్లారిటీగా అర్థం అయింది. ఇక ఇటీవల వీరి పదేళ్ల బంధానికి ముగింపు కార్డు వేయడంతో చాలా మంది ఆవేదన చెందారు అని అర్థమవుతోంది. ఈ ఊహించని పరిణామంతో ఫ్యాన్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక విడాకుల నిర్ణయాన్ని అఫీషియల్ గా ప్రకటించిన సమంత ప్రస్తుతం సినిమాలతో అయితే బిజీగా ఉండడం లేదు. ప్రస్తుతం సమంత కొంత ప్రైవసీతో ఉండాలని అనుకుంటుంది. అయితే త్వరలో ఆమె మొదలు పెట్టబోయే ఒక ప్రాజెక్టు పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అంతేకాకుండా ఆ సినిమాకు ఆమె తన సినీ జీవితంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

సడన్ గా అలా చెప్పడంతో

సడన్ గా అలా చెప్పడంతో

సమంత నాగచైతన్య ఇద్దరు కూడా బెస్ట్ స్టార్ కపుల్స్ అని చాలాసార్లు ప్రముఖుల చేత గుర్తింపును అందుకున్నారు. టాలీవుడ్ లోనే కాకుండా వీరికి సంబంధించిన వార్తలు బాలీవుడ్ మీడియాలో కూడా బాగానే వైరల్ అవుతుంటాయి. ఒక విధంగా ఈ జంట కాంట్రవర్సీలకు పెద్దగా తావివ్వకుండా పదేళ్ల పాటు ప్రేమతో కొనసాగుతూ వచ్చారు.

నిజంగా ఈ జోడి చూడముచ్చటగా ఉంది అని ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా తెలియజేశారు. కానీ హఠాత్తుగా శనివారం నాడు అందమైన జంట విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించడం ఓ వర్గం వారిని తీవ్రంగా కలచివేసింది.

కఠినంగా స్పందించిన సమంత

కఠినంగా స్పందించిన సమంత

సమంత నాగచైతన్య విడిపోతున్నట్లు గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా ప్రముఖ ఛానల్స్ లో కూడా ఈ విషయంపై కథనాలు చాలానే వచ్చాయి. కానీ అక్కినేని అభిమానులు మాత్రం ఇందులో ఎలాంటి నిజం లేదని అనుకున్నారు. అంతే కాకుండా మధ్యలో సమంత కాస్త ఘాటుగానే స్పందించింది.

అంతేకాకుండా తిరుపతి కి వెళ్ళినప్పుడు ఒక విలేకరి విడాకులు విషయంపై ప్రశ్నించడంతో గుడికి వచ్చాను అంటూ చాలా కఠినంగా సమాధానమిచ్చింది. ఆ సమాధానం తర్వాత విడాకులపై వస్తున్న వార్తలన్నీ కూడా అబద్ధాలని అభిమానులు అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా సమంత నాగచైతన్య గతవారం అఫీషియల్ గా ప్రకటించారు.

నేడు 4వ యానివర్సరీ

నేడు 4వ యానివర్సరీ

నేడు ఈ జంటకి ఒక ప్రత్యేకమైన రోజు అనే చెప్పాలి. సమంత నాగ చైతన్య 2017 లో ఇరు వర్గాల సాంప్రదాయాల ప్రకారం రెండు సార్లు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ముందుగా అక్టోబర్ 6వ తేదీన అక్కినేని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం నాగచైతన్య సమంత మెడలో మూడుముళ్లు వేశాడు. ఇక అక్టోబర్ 7వ తేదీన సమంత కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో క్రిస్టియన్ పద్ధతుల ప్రకారం మ్యారేజ్ చేసుకున్నారు. ఒకవిధంగా అప్పుడు సమంత నాగచైతన్య లకు సంబంధించిన పెళ్లి ఫోటోలు అయితే సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయ్యాయి. నిజంగా ఆ జంటను చూసి చాలా బాగుందిని అందరూ పాజిటివ్ గా కామెంట్ చేశారు.

ప్రైవసీ కావాలని ఆడిగినప్పటికి..

ప్రైవసీ కావాలని ఆడిగినప్పటికి..

ఇక గత వారం విడాకుల విషయం పై మొత్తానికి ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. వారి విడాకులకు సంబంధించిన అనేక రకాల కథనాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అసలు సమంత నాగచైతన్య ఎందుకు విడిపోయారు అనే ప్రశ్నల చుట్టూ ఎన్నో సందేహాలు కూడా పుట్టుకొస్తున్నాయి. నిజానికి నాగచైతన్య సమంత ఇద్దరూ కూడా ఇలాంటి కఠిన సమయంలో తమ వ్యక్తిగత జీవితం పై కొంత ప్రైవసీ చాలా అవసరమని కూడా ప్రత్యేకంగా వేడుకున్నారు. అయినప్పటికీ కూడా విడాకులపై వచ్చిన రూమర్స్ అక్కినేని కుటుంబ సభ్యులను అలాగే సమంత కుటుంబ సభ్యులను అసంతృప్తికి గురి చేసినట్లు తెలుస్తోంది.

త్వరలోనే మరో లేడి ఓరియెంటెడ్ మూవీస్

త్వరలోనే మరో లేడి ఓరియెంటెడ్ మూవీస్

ఇక ప్రస్తుతం సమంత అయితే ఎలాంటు సినిమాలు చేయడం లేదు. ఆమె చేయాల్సిన ఒక ప్రాజెక్ట్ అయితే ఇప్పట్లో మొదలయ్యే అవకాశం కూడా లేదట. అయితే సమంత తన పర్సనల్ జీవితం తన సినిమాలపై ఏమాత్రం ప్రభావం చూపకుండా జాగ్రత్త పడుతోంది. సామ్ ఇటీవల ఒక డెబ్యూటెంట్ డైరెక్షన్‌లో ఒక లేడీ ఓరియెటెడ్ ప్రాజెక్ట్ చేయడానికి ఓకే చెప్పింది. శ్రీదేవి మూవీస్ పతాకంపై నాని జెంటిల్‌మన్ మరియు సుధీర్ బాబు సమ్మోహనం నిర్మించిన ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు.

Recommended Video

Samantha పిల్లల్ని కనాలనే ఆశను చంపేశారు.. హాట్ టాపిక్ గా Madhavi Latha కామెంట్స్ | Filmibeat Telugu
అత్యదిక రెమ్యునరేషన్

అత్యదిక రెమ్యునరేషన్

అయితే సమంత ఆ ప్రాజెక్టు కోసం కెరీర్లోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకొనున్నట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం టాప్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్స్ కంటే కూడా ఎక్కువగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 3.50 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే సమంత తన సినీ జీవితంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న సినిమా కూడా అదే అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X