Naga Chaitanya తో విడాకుల విషయంలో నోరుజారిన కరణ్ జోహార్.. అలా సమంత కౌంటర్!
నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సమంత రూత్ ప్రభు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా బిజీగా కనిపిస్తోంది. అక్కడ మంచి ఆఫర్స్ తో పాటు ప్రముఖ టాక్ షోలతో కూడా పాల్గొంటూ తన స్థాయిని పెంచుకునే విధంగా సమంత అడుగులు వేస్తోంది. ఇక రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షోలో కూడా పాల్గొన్న సమంత మొదటిసారి తన విడాకులపై ఒక వివరణ అయితే ఇచ్చింది. అంతేకాకుండా కరణ్ జోహార్ పొరపాటున ఒక మాట చెప్పడంతో ఆమె ఇచ్చిన వివరణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

విడిపోయిన తరువాత
నాగచైతన్య సమంత విడిపోయిన తర్వాత అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అయితే ఆ విషయంలో తనపై ట్రోలలింగ్ నెగిటివ్ ప్రచారం చాలా జరిగింది అని అయినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోలేదు అని సమంత వివరణ ఇచ్చింది. మేము ఇద్దరం కూడా విడిపోయినప్పటికీ చాలా హ్యాపీగానే ఉన్నామని ఆ మూమెంట్లో కొంత భాద అనిపించినప్పటికీ ప్రస్తుతం నా లైఫ్ జర్నీలో నేను సంతృప్తి చెందుతున్నట్లుగా సమంత వివరణ ఇచ్చింది.

ఇప్పుడు ఓకే రూమ్ లో ఉంచితే..
అయితే ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడానికి ఇష్టపడలేనప్పుడు విడిపోవడం చాలా బెటర్ అంటూ.. మేము కూడా విడిపోయినప్పుడు మొదట బాధ పడినప్పటికీ ఆ తర్వాత చాలా ఈజీగా తీసుకున్నామని భవిష్యత్తులో కూడా మా మధ్యలో మంచి వాతావరణ ఉంటుంది అని అనుకుంటున్నట్లు సమంత తెలియజేసింది. అయితే నచ్చని క్రమంలో మాత్రమే ఇద్దరినీ ఒకే రూమ్ లో పెట్టినప్పుడు పక్కన బలమైన ఆయుధాలు ఉండకుండా చూసుకుంటే బెటర్ అని జోహార్ కు ఆమె సమాధానం ఇచ్చింది.

హస్బెండ్ కాదు.. ఎక్స్
అయితే కరణ్ జోహార్ ఒక ప్రశ్న వేస్తున్న సమయంలో సమంత ఊహించిన విధంగా సైలెంట్ గా ఒక కౌంటర్ ఇచ్చేసింది. మీ హస్బెండ్ తో విడిపోయిన తర్వాత చాలా ట్రోలింగ్ జరిగింది అని కరణ్ జోహార్ అడిగిన క్రమంలో హస్బెండ్ కాదు ఎక్స్ హస్బెండ్ అంటూ హఠాత్తుగా సవరణ చేసింది. దీంతో కరణ్ కూడా సారీ అంటూ మళ్ళీ ఎక్స్ హస్బెండ్ అని ప్రశ్నను అడిగాడు.

భారణంపై క్లారిటీ
ట్రోలింగ్ జరగడంపై తనకు అప్పట్లో ఎలాంటి క్లారిటీ లేదు అని సమాధానం చెప్పడానికి కూడా ఏమి తోచలేదు అని సమంత వివరణ ఇచ్చింది. ఇక తనకు 250 కోట్ల భరణం ఇచ్చినట్లుగా చాలా రకాల వార్తలు వచ్చినయని అయితే అందులో ఎలాంటి నిజం లేదు అని కూడా సమంత ఆ వార్తలను కొట్టి పారేసింది. ఇకలాంటి వార్తలు వచ్చినప్పుడు మొదట ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సోదాలు నిర్వహిస్తారేమో అని అనుకున్నట్లుగా సరదాగా మరో సమాధానం ఇచ్చింది.

అందుకే ఐటెమ్ సాంగ్ చేశాను
ఇక విడాకులు తీసుకున్న తర్వాతనే తాను పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకున్నాను అని ఎందుకంటే అందులో లిరిక్స్ నాకు చాలా బాగా నచ్చాయి అని సమంత తెలియజేసింది. పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న సమాజంలో వారి లోపాలను ఎత్తి చూపించడానికి ఆ పాట కరెక్ట్ గా సరిపోతుంది అని అందుకే ఆ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నట్లు సమంత వివరణ ఇవ్వడం టాపిక్ గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











