ఒకేసారి ఇద్దరి దర్శకులకు ఓకే చెప్పిన సమంత.. విడాకుల తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్..

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సమంత అక్కినేని ఇటీవల తన దాంపత్య జీవితానికి వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకున్న అనంతరం ఆమె మళ్లీ తన కెరీర్ పై కాస్త ఎక్కువగానే ఫోకస్ పెట్టింది. గతంలో సెలెక్టివ్ గా సినిమాలను చేసుకుంటూ వచ్చిన సమంత ఇప్పుడు మాత్రం రెగ్యులర్ హీరోయిన్ తరహాలో సినిమాలు చేయాలని ప్లాన్ చేసుకుంటోంది. అందులో వీలైనంతవరకు లేడి ఓరియెంటెడ్ సినిమాలు ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు కూడా అర్ధమవుతోంది. ఇక రీసెంట్ గా సమంత ఇద్దరు దర్శకులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కంటెంట్ బాగుంటేనే

కంటెంట్ బాగుంటేనే

సమంత ఏలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక పాయింట్ హైలెట్ అయ్యేలా చూసుకుంటుంది. వీలైనంతవరకు నేటి తరం వారికి సరికొత్త గా కనిపించాలి అనేలా ఆలోచిస్తుంది. అందుకే ఆమె సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు అందుకుంటున్నాయి. ఒక విధంగా పెళ్లి అయిన తర్వాత సమంత తన స్టార్ డమ్ ను ఇంకాస్త ఎక్కువగానే పెంచుకుందని చెప్పవచ్చు. చాలా వరకు ఆమె కమర్షియల్ సినిమాలను రిజెక్ట్ చేస్తూనే వస్తోంది. బడ్జెట్ తక్కువ అయినా సరే కంటెంట్ బాగుంటేనే సమంత గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

కేవలం తనకు సెట్టయ్యే కథలను మాత్రమే..

కేవలం తనకు సెట్టయ్యే కథలను మాత్రమే..

త్వరలోనే మరో కొత్త తరహా కంటెంట్ రాబోతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇక సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకోబోతున్నట్లు ఇటీవల కథనాలు రాగా అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇక మెల్లగా ఆ విషయాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్న సమంత ఎప్పటిలానే సినిమాలతో బిజీ అవ్వాలని అనుకుంటుంది. మొన్నటి వరకు కాస్త విశ్రాంతి లోనే ఉన్న ఆమె ఇప్పుడు మాత్రం రెగ్యులర్ సినిమాలతో షూటింగులతో బిజీ అవ్వాలని అనుకుంటుంది. ఆమె వద్దకు చాలా కథలు వస్తున్నాయి కానీ సమంత మాత్రం కేవలం తనకు సెట్ అయ్యే కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది.

ఇద్దరి దర్శకులను గ్రీన్ సిగ్నల్

ఇద్దరి దర్శకులను గ్రీన్ సిగ్నల్

ఇక ఇటీవల సమంత ఒక దర్శకద్వయం కు సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. హరి - హరీష్ అనే ఇద్దరు దర్శకులు చెప్పిన ఒక ఆసక్తికరమైన కథకు సమంత సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చెప్పేసిందట. కథ బాగా నచ్చడంతో ఎలాంటి అనుమానాలు లేకుండా వెంటనే ప్రాజెక్టును మొదలు పెట్టాలని చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను తమిళ్ తెలుగులో ఒకేసారి తెరకెక్కించబోతున్న ట్లు సమాచారం. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే మొదలయ్యాయి.

Recommended Video

Pooja Hegde, Akhil Akkineni Interview | Most Eligible Bachelor
భారీగా రెమ్యునరేషన్..

భారీగా రెమ్యునరేషన్..

ఇక సమంత రెమ్యునరేషన్ కు సంబంధించిన కథనాలు అయితే ఇటీవల కాలంలోనే చాలానే వెలువడ్డాయి ఆమె తన పారితోషికాన్ని మరింత పెంచినట్లు గా ఓక టాక్ అయితే వస్తోంది. గతంలో రెండు కోట్ల లోపే తీసుకున్న సమంత ఈసారి మాత్రం లేడి ఓరియెంటెడ్ సినిమా కోసమని ఏకంగా మూడు కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న పూజా హెగ్డే మాత్రమే ఆ స్థాయిలో డిమాండ్ చేస్తోంది. ఇక సమంత ఆ రికార్డును బ్రేక్ చేయలని చూస్తోంది. మరి ఈ లెక్కలు ఇంకా ఏ స్థాయిలో పెరుగుతాయో చూడాలి. శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ ప్రాజెక్టును శ్రీదేవి మూవీస్ పై నిర్మించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X