Don't Miss!
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నన్ను నేను బెటర్ చేసుకునేలా చాలెంజ్ చేసిన పాత్ర అది.. సమంత ఎమోషనల్ పోస్ట్
సౌత్‌లో మరో సూపర్ స్టార్ పుట్టుకొస్తుంది. వరుస హిట్లతో దూసుకుపోతూ.. సమంత లక్కీ హ్యాండ్‌గా మారింది. పెళ్లి తరువాత గేర్ మార్చి ఫుల్ స్పీడ్‌లో పరిగెడుతోంది. టాలీవుడ్, కోలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టేసి.. హల్ చల్ చేస్తోంది.
పెళ్లాయ్యాక కలిసిసొచ్చిన లక్..
నాగ చైతన్యతో పెళ్లాయక సమంతకు బాగానే కలిసి వచ్చింది. తీసిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అవుతోంది. రంగస్థలం, అభిమన్యుడు, సూపర్ డీలక్స్, ఓ బేబీ ఇలా అన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్ కాగా.. పెళ్లయ్యాక తొలిసారి కలిసి నటించిన మజిలీచిత్రం వీరి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ..
సమంత్ సూపర్ స్టార్ అనడానికి కారణం.. యూ టర్న్, ఓ బేబీ. ఈ రెండు చిత్రాలను సమంత తన భుజాలపై మోసింది. ఇవి రెండూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. ఇదే కాక మరో చిత్రం కూడా సమంత హిట్ లిస్ట్‌లోకి రానుంది.
తమిళ సెన్సేషన్ 96
విజయ్ సేతుపతి, త్రిష జంటగా వచ్చిన 96 సినిమా తమిళ నాట ఎంతటి సెన్సేషన్‌ను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని అవార్డులను ఈ చిత్రానికే రాగా.. త్రిషకు ప్రత్యేకమైన అభినందనలు వచ్చాయి. సినిమాలో సంగీతం ప్రధానం హైలెట్ అయింది. ఈ చిత్రంలోని పాట దక్షిణాదిని ఓ ఊపు ఊపేసింది.
జానుగా రీమేక్...
అయితే ఆ సినిమా తెలుగులో రీమేక్ చేయనున్నారు. అదే యూనిట్‌తో శర్వానంద్, సమంతలతో ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్లో భాగంగానే స్కై డైవింగ్ నేర్చుకుంటున్న శర్వానంద్‌కు గాయాలయ్యాయి. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ ప్రస్తుతం బయటకు వచ్చింది.
|
నన్ను నేను బెటర్ చేసుకున్నాను..
ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ మూవీలోని పాత్ర.. నిన్నటి కంటే నేటికి నన్ను నేను బెటర్ చేసుకునేలా చాలెంజ్ చేసింది. ప్రతీ రోజూ మ్యాజిక్ క్రియేట్ చేసేలా పని చేసిన ఈ యూనిట్‌తో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. జాను పాత్రను పోషించినందుకు ఎమోషనల్ అయిన సమంత ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా స్పందించింది.