For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నన్ను నేను బెటర్ చేసుకునేలా చాలెంజ్ చేసిన పాత్ర అది.. సమంత ఎమోషనల్ పోస్ట్

|

సౌత్‌లో మరో సూపర్ స్టార్ పుట్టుకొస్తుంది. వరుస హిట్లతో దూసుకుపోతూ.. సమంత లక్కీ హ్యాండ్‌గా మారింది. పెళ్లి తరువాత గేర్ మార్చి ఫుల్ స్పీడ్‌లో పరిగెడుతోంది. టాలీవుడ్, కోలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్‌లు కొట్టేసి.. హల్ చల్ చేస్తోంది.

పెళ్లాయ్యాక కలిసిసొచ్చిన లక్..

పెళ్లాయ్యాక కలిసిసొచ్చిన లక్..

నాగ చైతన్యతో పెళ్లాయక సమంతకు బాగానే కలిసి వచ్చింది. తీసిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అవుతోంది. రంగస్థలం, అభిమన్యుడు, సూపర్ డీలక్స్, ఓ బేబీ ఇలా అన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్ కాగా.. పెళ్లయ్యాక తొలిసారి కలిసి నటించిన మజిలీచిత్రం వీరి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ..

లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ..

సమంత్ సూపర్ స్టార్ అనడానికి కారణం.. యూ టర్న్, ఓ బేబీ. ఈ రెండు చిత్రాలను సమంత తన భుజాలపై మోసింది. ఇవి రెండూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. ఇదే కాక మరో చిత్రం కూడా సమంత హిట్ లిస్ట్‌లోకి రానుంది.

తమిళ సెన్సేషన్ 96

తమిళ సెన్సేషన్ 96

విజయ్ సేతుపతి, త్రిష జంటగా వచ్చిన 96 సినిమా తమిళ నాట ఎంతటి సెన్సేషన్‌ను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని అవార్డులను ఈ చిత్రానికే రాగా.. త్రిషకు ప్రత్యేకమైన అభినందనలు వచ్చాయి. సినిమాలో సంగీతం ప్రధానం హైలెట్ అయింది. ఈ చిత్రంలోని పాట దక్షిణాదిని ఓ ఊపు ఊపేసింది.

జానుగా రీమేక్...

జానుగా రీమేక్...

అయితే ఆ సినిమా తెలుగులో రీమేక్ చేయనున్నారు. అదే యూనిట్‌తో శర్వానంద్, సమంతలతో ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్‌లో భాగంగానే స్కై డైవింగ్ నేర్చుకుంటున్న శర్వానంద్‌కు గాయాలయ్యాయి. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ ప్రస్తుతం బయటకు వచ్చింది.

నన్ను నేను బెటర్ చేసుకున్నాను..

ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ మూవీలోని పాత్ర.. నిన్నటి కంటే నేటికి నన్ను నేను బెటర్ చేసుకునేలా చాలెంజ్ చేసింది. ప్రతీ రోజూ మ్యాజిక్ క్రియేట్ చేసేలా పని చేసిన ఈ యూనిట్‌తో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. జాను పాత్రను పోషించినందుకు ఎమోషనల్ అయిన సమంత ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

English summary
And it’s a wrap!! Another special film and a role that has challenged me to be better than I was yesterday .blessed to work with a team that manages to create magic everyday .Thankyou premkumardop and sharwanand for being my dream team .Janu, living my best life, grateful always.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more