ఓ బేబి ఎఫెక్ట్.. రెమ్యునరేషన్‌తో షాక్ ఇస్తున్న సమంత!

జెస్సిగా సమంత టాలీవుడ్ ఆడియెన్స్ కి పరిచయమైనప్పటి నుంచి కూడా ఏనాడు కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కోలేదనే చెప్పాలి. కేవలం హిట్స్ అనే కాకుండా అపజయాలు కూడా ఆమెను చాలా సార్లు దెబ్బకొట్టడానికి ప్రయత్నం చేశాయి. కానీ సమంత మాత్రం తగ్గలేదు. అవకాశం వచ్చినా ప్రతిసారి బాక్సాఫీస్ హిట్స్ అందుకోవడమే కాకుండా నటనలో కూడా తన సరికొత్త టాలెంట్ ని బయటపెడుతూ వచ్చింది.

మహానటి, రంగస్థలం వంటి హిట్స్ తరువాత సమంత రెమ్యునరేషన్ డోస్ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా. లేడి ఓరియెంటెడ్ కథలకు ఆమె అంధరికంటే ఎక్కువగా డిమాండ్ చేస్తున్నట్లు టాక్. ఎందుకంటే ఓ బేబి సినిమా మంచి లాభాలను అందించడంతో అక్కినేని వారి కోడలికి లేడి ఓరియెంటెడ్ ఆఫర్స్ గట్టిగానే వస్తున్నాయి. ఇటీవల ఒక థ్రిల్లర్ సినిమా కోసం ఒక తమిళ నిర్మాత సమంతను సంప్రదించగా ఆమె ఒక్కసారిగా 3.5కోట్లను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

Samantha demanding huge remuneration for upcoming lady thriller

తెలుగు తమిళ్ మళయాళం కన్నడ భాషల్లో సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాత ప్లాన్ చేసుకోవడం వలనే సమంత ఆ విధమైన రేట్ ని చెప్పినట్లు సమాచారం. ఇక లవ్ స్టోరీలు చాలా వస్తున్నా ఎందుకో సమంత అంతగా ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలుస్తోంది. కేవలం తనకు నచ్చిన కథలపై మాత్రమే ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతోంది. ఇక నయనతార, అనుష్క వంటి వారు డిమాండ్ చేస్తున్నట్లుగానే సమంత కూడా రెమ్యునరేషన్ డోస్ పెంచినట్లు కోలీవుడ్ లో కథనాలు గట్టిగానే వస్తున్నాయి. ఇక నెక్స్ట్ సమంత తన భర్త నాగ చైతన్య కూడా మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X