Samantha Temple: సమంతకు గుడి కట్టిస్తున్న వీరాభిమాని.. ఎక్కడో తెలుసా?
సినీ తారలపై ప్రేక్షకుల అభిమాను ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. హీరోలు, హీరోయిన్ల కోసం ఏమైనా చేస్తారు ఫ్యాన్స్. ఒక్కోసారి ప్రేమ హద్దులు దాటుతుంది. అలాంటి అభిమానంతో కొంతమంది ఫ్యాన్స్ ఇతరుల చావుకు కారణం అయితే మరికొందరి అభిమానం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తన అభిమాన తారల కోసం అభిమానులు గుడి కడుతారన్న విషయం తెలిసిందే. అలా ఇప్పటికీ పలువురికి గుడి కట్టారు వారి ఫ్యాన్స్. ఇప్పుడు ఆ జాబితాలోకి స్టార్ హీరోయిన్ సమంత చేరిపోయింది.
ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయి అందరినీ మాయ చేసింది బ్యూటిఫుల్ సమంత. మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ అందుకున్న ఈ చిన్నది తర్వాత అనేక మంది అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుసగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న సమంత ఇటీవల శాకుతంలంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏప్రిల్ 14న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంటోంది.

ప్రముఖ డైరెక్టర్ గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని గ్రాఫికల్ విజువల్స్ పై నెగెటివిటీ వస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత సిటాడెల్ అనే వెబ్ సిరీసులో నటించేందుకు సిద్ధంగా ఉంది. ప్రియాంక చోప్రా లీడ్ రోల్ చేసిన ఈ సిరీస్ ఇండియన్ వెర్షన్ లో సమంత యాక్ట్ చేస్తోంది. ఈ వెబ్ సిరీస్ ను ప్రమోట్ చేసేందుకు లండన్ లో ప్రీమియర్ షోలు వేశారు. ఇందులో భాగంగానే సమంత లండన్ కు వెళ్లింది. ఇండియాకు వచ్చిన తర్వాత సిటాడెల్ షూటింగ్ లో పాల్గొననుంది.
ఇదిలా ఉంటే సమంత వీరాభిమాని ఒకరు ఆమెకు గుడి కట్టబోతున్నాడు. సీనియర్ హీరోయిన్ కుష్బూ, నయనతార, హన్సిక, నిధి అగర్వాల్, నమితకు వారి అభిమానులకు గుడి కట్టారు. ఇప్పుడు ఆ హీరోయిన్ల జాబితాలోకి సామ్ చేరింది. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల నివాసి అయిన సందీప్ సమంతకు వీరాభిమాని. ఆమె మయోసైటిస్ బారిన పడినప్పుడు కోలుకోవాలంటూ తిరుపతి, చెన్నై, నాగ పట్నంలో మొక్కుబడి యాత్ర చేశాడు.

ఇప్పుడు ఏకంగా సమంతకు గుడి కడుతున్నాడు. బాపట్లలోని ఆలపాడు సందీప్ స్వస్థలం. ఆలపాడులోని తమ సొంత ఇంట్లో సామ్ కోసం అతను గుడి కడుతున్నాడు. ప్రస్తుతం గుడి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 28న సమంత బర్త్ డే. ఆరోజు వరకు ఈ గుడి నిర్మాణ పనులు పూర్తి అవుతాయట. అదే రోజున ఓపెనింగ్ ఉంటుందని సమాచారం. ఇలా ఏపీలో గుడి కట్టించుకున్న తొలి హీరోయిన్ గా సమంత నిలిచినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











